అవార్డుల వాపసుపై   భిన్న వాదనలు 

Different Arguments On Giving Back Of Awards

05:30 AM ON 1st January, 1970 By Mirchi Vilas

Different Arguments On Giving Back Of Awards

దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయాంటూ కొందరు రచయితలు అవార్ధులు వెన్నక్కి ఇస్తున్నట్లు ప్రకటించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి . మత సహనానికి విఘాతం కల్గు తొందని నిరసన వ్యక్తం చేస్తూ, రచయితలు అవార్డులను వెనక్కి ఇస్తున్నారంటే బిజెపి హయాంలో దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో వేరేచెప్పనవసరం లేదని కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు విమర్శిస్తున్నాయి .కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో డిల్లీలో భారీ ర్యాలీ కూడా నిర్వహించి , బిజెపి సర్కార్ తీరుని ఎండ గట్టారు. ఇలా అవార్డులు వెనక్కి ఇచ్చే వాళ్ళంతా మొదటినుంచీ బెజేపీని వ్యతిరేకించే వారేనని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు . ప్రధాని నరేంద్ర మోడీ ని అపఖ్యాతి పాలు చేయడానికే ఈవిధంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాలీవూడ్ నటుడు షారూక్ ఖాన్ కూడా రచయితల కు మద్దతు పలకడంపై విహెచ్‌పీ నేత సాధ్వీ ప్రాచీ ఫైర్ అయ్యారు . షారూఖ్ ని జాతి వ్యతిరేకిగా ఆమె అభివర్ణించారు . షారూఖ్ ఆత్మ పాకిస్తాన్ లో ఉందని ఆమె వ్యాఖ్యానించారు . కాగా హీరో కమల్ హాసన్ రచయితల తీరుని తప్పు బట్టారు . అవార్డులతో బాటూ వచ్చిన డబ్బులు వాడేసుకుని , ఇప్పుడు అవార్డులు వెనక్కు ఇస్తున్నట్లు ప్రకటించడం సరికాదని వ్యాఖ్యానించారు . అయినా నిరసన తెలిపే విధానం ఇది కాదన్నారు . బిజెపి పాలనకు ముందే దేశంలో అసహన పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు . మొత్తానికి ఈవివాధం సినీ వర్గాలను కూడా తాకింది . రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీసుందో చూడాలి.

English summary

Expressing anguish over recent communal incidents in the country, noted authors have made a beeline for returning their prized Sahitya Akademi Awards. It is in protest against the atmosphere of communal intolerance in India, which they say has plagued the nation. They have also blamed the central government of doing nothing to put an end to it.