అందరి చూపు 'హెచ్ సి యు' ఘటనపైనే ...

Different arguments On HCU Suicide Incident Case

12:17 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Different arguments On HCU Suicide Incident Case

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో(హెచ్ సి యు) పిహెచ్ డి విద్యార్ధి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన యావత్తు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నాయకులు , మీడియా అందరి చూపు ఈ ఘటనపైనే. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ ఘటనపై సోషల్ మీడియాలో , చానెల్స్ లో చర్చొప చర్చలు, వ్యాఖ్యానాలు , కధనాలు వస్తున్నాయి. డిల్లీ నాయకులు కూడా దీనిపై ద్రష్టి సారించారు. ఇప్పటికే ఎ ఐ సిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి హెచ్ సి యు సందర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై , యూనివర్సిటీ అధికారులపై ద్వజమెత్తారు. ఇక డిల్లీ సిఎమ్ కేజ్రీవాల్ కూడా ఈఘటనపై స్పందిస్తూ , కేంద్రంపై విరుచుకుపడ్డారు. మరోపక్క కేంద్రం నుంచి విచారణ బృందం వచ్చి వివరాలు సేకరిస్తోంది. అలాగే పోలీసు , రెవెన్యూ యత్రాంగాలు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాయి.

కొనసాగుతున్న ఆందోళన ....

హైదరాబాద్ లో అలాగే ,ఎపిలో నే కాదు దేశంలోని వివధ ప్రాంతాల్లో ఈ ఘటనపై ఆందోళనలు సాగుతున్నాయి. ప్రదర్శనలు , ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో వీసీ, కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలని 14 విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు నేతలు తెలిపారు. ఈనెల 23న ‘చలో హెచ్‌సీయూ' పేరుతో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

మాజీ మంత్రి డొక్కా వివరణ ఇలా వుంది ....

కాగా రోహిత్ వేముల సామాజిక వర్గం (కులం)పై విభిన్న వాదనలు వినిపిస్తున్న నేపధ్యంలో బుధవారం ఉదయం ఓ టీవీ ఛానల్‌తో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చే యత్నం చేసారు. 'రోహిత్ తల్లి మాల కులానికి చెందినది కాగా, తండ్రి బీసీ జాబితాలోని ‘వడ్డెర' కులానికి చెందిన వారు. రొహిత్ చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె తన కుమారుడు రోహిత్‌తో కలిసిగురజాలలో నివసిస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు. రోహిత్ వడ్డెర కులానికి చెందిన వాడేనని, దీనిపై ఎలాంటి రాజకీయం చేయొద్దని ఆయన కోరారు.

కుటుంబ సభ్యుల వాదన ...

మరోవైపు రోహిత్ నాన్నమ్మ రాఘవమ్మ మాట్లాడుతూ తాము వడ్డెర కులానికి చెందిన వారమని పేర్కొనడంతో పాటూ , తన కోడలు, కొడుకు సైతం వడ్డెర కులానికి చెందిన వారేనని ఆమె స్పష్టం చేసింది దీనికి సంబంధించి రోహిత్ నానమ్మ మాటల వీడియో సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

రోదిస్తున్న తల్లి ..

యూనివర్సిటీలోనే తమ కొడుకు కన్నుమూసిన నేపథ్యంలో ఈ చదువులు మాకొద్దని ఆ తల్లి అంటోంది. తన రెండో కొడుకును ఎంతమాత్రం చదివించనని రోహిత్ తల్లి రాధిక ఆవేదన తో చెబుతోంది. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రోహిత్ తల్లిని, కుటుంబసభ్యులని పరామర్శించారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి తన ఆవేదన తెల్పింది. రోహిత్ మృతికి హెచ్‌సీయూ వీసీనే కారణమని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆమె తెలిపారు. రోహిత్ సస్పెండ్ చేసినట్టు తమకు చెప్పలేదని, సస్పెండ్ చేశారని తెలిస్తే తాము అతన్ని ఇంటికి తెచ్చుకునేవాళ్లమన్నారు. కూలీపనులు చేస్తూ రోజుకు రూ. 150 తీసుకొచ్చి రోహిత్‌ను చదివించానని, కొడుకును సమాజంలో ఉన్నతస్థానంలో చూసుకోవాలనుకున్నానని తెలిపారు. తన కొడుకు పెద్దవాడు అవుతాడనుకుంటే శవమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం నుంచి బయటకు రావాలనే తాను కొడుకును చదివించానని, పుస్తకాలు కొనుక్కొనే స్థామత లేకపోవడంతో రోహిత్ లైబ్రరీలో చదువుకున్నాడని చెప్పారు.

మరో విద్యార్ధి సంఘం వాదన ....

కాగా రోహిత్ కి సంబంధించిన పుట్టిన తేదీ దరఖాస్తు పత్రాలను కూడా ఓ విద్యార్ధి సంఘం విడుదల చేసింది. అందులో వారు తమ కులాన్ని వడ్డెరగా పేర్కొన్నారు. రోహిత్ వేముల చదువులో మంచి మెరిట్ స్టూడెంటేనట. యూనివర్సిటీలో అతడు రిజర్వేషన్ కేటగిరీ కింద కాకుండా జనరల్ కోటాలోనే సీటు సాధించాడట. ఈ మేరకు మంగళవారం ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యలను ఊటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా' ఆసక్తికర కథనాన్ని అందించింది.. జనరల్ కోటాలో సీటు సాధించిన రోహిత్ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేకపోయిందట. అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు వర్సిటీలో తగిన ఆధారాలు లేవని తెలుస్తోంది. అడ్మిషన్ సందర్భంగా తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడినేనని పేర్కొన్న రోహిత్, అందుకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని మాత్రం జత చేయలేదంట. యూనివర్శిటీలో రోహిత్ సమర్పించిన ధ్రువపత్రాలను ఇపుడే తాము బహిర్గతం చేయలేమని యూనివర్శిటీ పాలకులు అంటున్నారట. రోహిత్ సమర్పించిన ధ్రువపత్రాల్లో వాస్తవాలు తేల్చాల్సింది తాము కాదని, సంబంధిత రెవిన్యూ అధికారులే ఆ వ్యవహారం చూడాలని ఓ యూనివర్శిటీ అధికారి అభిప్రాయపడ్డారు.

చర్యలు తీసుకోవాల్సిందే ...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ ఘటనపై తీవ్రంగా కలత చెందిన విద్యార్ధి సంఘాలు అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే వైస్ చాన్సలర్‌ను తొలగించాలని, అలాగే కేంద్ర మంత్రివర్గం నుండి బండారు దత్తాత్రేయను బర్తరఫ్ చేయాలని వారు కోరుతున్నారు.

అవార్డు వెనక్కి ఇచ్చేసిన రచయిత....

దేశంలో అసహన పరిస్థితులపై స్పందిస్తూ ఆమధ్య దేశంలో కొందరు రచయితలు అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించగా , తాజాగా హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అశోక్ వాజపేయి అనే రచయిత తన అవార్డును వెనక్కి ఇచ్చారు. హెచ్‌సియు తనకు ఇచ్చిన డీ.లిట్ అవార్డును ఆయన మంగళవారం నాడు వెనక్కి ఇచ్చారు.

అదంతా అవాస్తవం అంటున్న విసి ....

హెచ్‌సీయూలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు తానే కారణమని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలె అప్పారావు తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ ముందు హాజరయ్యేందుకు వెళుతూ గత రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. నిరాధారమైన ఆరోపణలతో రాజీనామా చేయాలంటున్న వారికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. తాను ఏ తప్పూ చేయకుండా రాజీనామా ఎందుకు చేయాలి? అని ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నందున కుటుంబంతో సహా యూనివర్సటీ నుంచి బయటికి వెళ్లాలని నాతోపాటు క్రమశిక్షణ అధికారి అలోక్‌పాండే, విద్యార్థి సంక్షేమ విభాగం డీన్‌ ప్రకాశ్‌బాబును డీసీపీ కార్తికేయ అదేశించార ని ఆయన చెప్పారు.

English summary

Different Different Arguments were coming On Hyderabad Central University ()HCU)Student Rohit Suicide Case.Some of the politicians like Delhi Cheif Minister Kejriwal, All India Congress Commitee president Rahul Gandhi,MIM Leader Asaduddeen Owaisi were also responded on Hyderabad Central University(HCU) student Rohit Suicide Case