షాకింగ్ న్యూస్: గర్భిణీ మెదడులో మార్పులు!

Different changes occurs in the mind of a pregnant Lady

11:54 AM ON 22nd December, 2016 By Mirchi Vilas

Different changes occurs in the mind of a pregnant Lady

అమ్మదనం కమ్మదనం అంటారు. అందుకే గర్భం ధరించిన మహిళలకు కలిగే ఆనందం అంతా ఇంతాకాదు. అయితే గర్భిణీ దాలిస్తే, ఫలితంగా ఆ మహిళలో కొన్ని మార్పులు సంభవిస్తాయట. మహిళలు గర్భం దాల్చినపుడు వారి మెదడులో కొన్ని భౌతికపరమైన మార్పులు వస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైందట. అదేమిటి అంటే, ఆ సమయంలో వారి మెదడులోని భాగాలలో గ్రే మ్యాటర్ ను కోల్పోతారని అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా(యూఏబీ) పరిశోధకులు అంటున్నారు. అయితే, ఈ మార్పుల వలన వారికి లాభం చేకూరుస్తాయని, మాతృత్వపు సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధమయ్యేలా చేస్తాయని అంటున్నారు. వారు పిల్లల మానసిక స్థితి, ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఈ మార్పులు దోహదపడతాయని పరిశోధనలో వెల్లడైందట. కొంతమంది గర్భిణుల్లో ఈ మార్పులు రెండు సంవత్సరాలపాటు కొనసాగాయని ఉదహరిస్తున్నారు. ఇందుకోసం పరిశోధకులు 25 మంది తొలిసారిగా గర్భం దాల్చిన మహిళలను పరీక్షించారు. గర్భం దాల్చక ముందు, తర్వాత వారి మెదళ్లను స్కానింగ్ తీశారు. గర్భం దాల్చాక వారి మెదళ్లలోని గ్రే మ్యాటర్ పరిమాణం తగ్గడాన్ని గుర్తించారు. ప్రసవానంతరం కూడా రెండేళ్లపాటు వారిని పరిశీలించారు. ఈ మార్పుల వల్ల వారి జ్ఞాపక శక్తి, తదితర విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగలేదని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కూడా చూడండి: అనసూయ ఏడ్చేసింది ... ఎందుకో తెలుసా ?

English summary