ఇలాంటి చిత్ర విచిత్ర భక్తులని చూసారా!

Different Types Bhakthulu

03:05 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Different Types Bhakthulu

భక్తులు వారిలో రకాలు ఇదేంటి అనుకుంటున్నారా ? అవునండీ బాబు ఒక్కొరికి భక్తి ఒకో విధంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది దేవుళ్ళు మన భారతదేశంలోనే ఉన్నారు. దేవుళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు భక్తులు ఎంతమంది ఉండాలి మరి. వింత వింత కోర్కెలతో గుడికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ భక్తులు వింత వింత కోర్కెలు వింత వింత చేష్టలు ఎలా ఉంటాయో చూడండి మరి.

1/10 Pages

1. భయపడే భక్తులు

భయపడే భక్తులు కూడా ఉంటారా అనుకుంటున్నారా ? అవును భయపడి గుడికి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు దేవుడు గుర్తు రావాంటే భయపెట్టే విషయం ఏదో ఒకటి జరిగితీరాల్సిందే...తరువాత చూడాలి వాళ్ళభక్తి పీక్స్‌ కి వెళ్ళిపోతుంది. గుడికి వెళ్ళి అక్కడైనా ప్రశాంతంగా ఉంటారా అంటే....చెప్పులు ఎవరు కొట్టేస్తారా....ప్రసాదం ఎక్కడ అయిపోతుందో అని భయపడుతూనే ఉంటారు.

English summary

Here are the different types of bhakthulu. Naturally we see in temples different kinds of bhakthulu. Like fear, devotional, business mind, mad etc..