డిజిటల్ బ్యాంకింగ్ దిశగా అడుగులు

Digital banking in India

12:56 PM ON 25th November, 2016 By Mirchi Vilas

Digital banking in India

మనదేశంలో నగదు లావాదేవీలే అధికం. అయితే ఇప్పుడు అంతా పరిస్థితి మారిపోతుందనేలా వుంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే, డబ్బు డిజిటలైజ్ అయిపోతుందా? కరెన్సీ నోట్లు ఆకాశంలో చుక్కల్లా మారిపోతాయా? లావాదేవీలన్నీ కార్డులు, ఈ-వాలెట్లు, యాప్ ల ద్వారానే జరిగే రోజులు రాబోతున్నాయా? అనే సందేహం రావడం సహజమే. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాటలు వింటే ఇదే నిజమనిపిస్తోంది. అన్ని బ్యాంకుల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహించినట్లు ఆయన చెబుతూ, డిజిటల్ బ్యాంకింగ్ విస్తరించడమే ఈ సమావేశాల ఏకైక ఎజెండాగా పేర్కొన్నారు.

1/3 Pages

డిజిటల్ బ్యాంకింగ్ విస్తరించడం గొప్ప వ్యాపార అవకాశమని బ్యాంకులకు స్పష్టం చేశామని, ఈ చర్యలను భారీగా అమలు చేయాలని తెలిపినట్లు అయన వివరించారు. డిజిటల్ బ్యాంకింగ్ విస్తరణను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు.

English summary

Digital banking in India