బ్రేకింగ్ న్యూస్: డిజిటల్ కరెన్సీ వచ్చేస్తోంది!

Digital currency is coming into India

12:19 PM ON 30th November, 2016 By Mirchi Vilas

Digital currency is coming into India

రూ. 500, రూ. 1000 పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇండియన్ కరెన్సీ చరిత్రలో పెను విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఇక డిజిటల్ కాయిన్లదే హవా కాబోతోంది. బిట్ కాయిన్ స్టార్టప్ అయిన యూనో కాయిన్.. యాపిల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, గూగుల్ యాండ్రాయిడ్ వ్యవస్థలకోసం వినూత్నమైన యాప్ డెవలప్ చేసింది. ఈ సంస్థ(యూనో కాయిన్) పుణ్యమా అని ఇక వినియోగదారులు ఏ రిమోట్ డివైజ్ ద్వారానైనా ఈ యాప్ ను ఉపయోగించి డిజిటల్ కాయిన్లతోనే తమ ఆర్ధిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు, కొనుగోళ్ళు, అమ్మకాలు చేయవచ్చట.
ఈ నాణేలను రిసీవ్ చేసుకోవడమే కాదు.. తమ దగ్గర ఉంచుకోవచ్చట కూడా.

1/3 Pages

ప్రస్తుతం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఇలాంటి బిట్ కాయిన్ ఎడాప్టేషన్ ప్రాధాన్యం పెరగడం ఖాయమని యూనో కాయిన్ కో-ఫౌండర్ అభినంద్ కసేటి అంటున్నారు.
తమ సొంత పబ్లిక్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ను వినియోగించి ఈ యాప్ ను డెవలప్ చేశామని, ఈ డిజిటల్ కరెన్సీ ఏ దేశ ప్రభుత్వం, లేదా సెంట్రల్ బ్యాంకు అధీనంలో లేదని వివరించారు.

English summary

Digital currency is coming into India