పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులు ప్రమాదమా

Digital Payments Danger At Petrol Bunks

11:01 AM ON 26th December, 2016 By Mirchi Vilas

Digital Payments Danger At Petrol Bunks

డిజిటల్ లావాదేవీలు జరపాలని, నగదు చెల్లింపులు చాలావరకూ తగ్గించేయాలని కేంద్రం సూచిస్తూ ఆదిశగా చర్యలు చేపడుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే చాలా చోట్ల పేటీఎం లు వెలుస్తున్నాయి. ఇక పెట్రోలు బంకుల విషయంలోకి వస్తే, సాధారణంగా పెట్రోల్ బంకుల్లో మొబైల్ వాడకం నిషేధం. మొబైల్ వాడొద్దంటూ పలు పెట్రోల్ బంకుల్లో హెచ్చరిక చేస్తూ పోస్టర్స్ కూడా ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో క్యాష్ లెస్ ఎకానమీని ప్రవేశపెట్టేందుకు కార్డు లావాదేవీలను కేంద్రం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా పేటీఎం ద్వారా నగదు చెల్లింపులు భారీగా పెరిగాయి. అయితే పేటీఎం ద్వారా పెట్రోల్ బంకుల్లో నగదు చెల్లింపులు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో మొబైల్ పేలే ప్రమాదముందని, అలాంటి ఘటనలు కూడా గతంలో జరిగాయని చెబుతున్నారు. అలాంటివి చూసి కూడా పెట్రోల్ బంకుల్లో మొబైల్ ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు.

పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజన్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పెసో) కూడా సదరు మంత్రిత్వ శాఖను హెచ్చరించింది. పెట్రోల్ బంకుల్లో ఈపోస్ మిషన్ల వాడకాన్ని నిలిపివేయాలని, బంకుల్లో నోట్ల ద్వారానే చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించింది. చట్ట ప్రకారం పెట్రోల్ బంకుల సమీపంలో జోన్ I, జోన్II పరిధిలో మొబైల్ వ్యాలెట్లు, ఈపోస్ మిషన్లు వాడటం ప్రమాదకరమని, వాహనాల్లో ఇంధనాన్ని నిలిపే సమయంలో వీటిని వాడరాదని పెసో తెలిపింది. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా పునరాలోచించాలని భావిస్తోంది. పెట్రోల్ బంకుల్లో మొబైల్ ద్వారా నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని భావిస్తోంది. మరి పెట్రోలు బ్యాంకుల్లో ప్రత్యామ్నాయం వచ్చేవరకూ నగదు చెల్లింపులు శరణ్యమా.

ఇది కూడా చూడండి: నోట్ల రద్దు నేపథ్యంలో కురిపించిన వరాలు ఇవే

ఇది కూడా చూడండి: పార్వతి శాపంతో కప్పగా 12 ఏళ్లపాటు గడిపిందెవరంటే ...

ఇది కూడా చూడండి: మహిమ గల కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి గురించి తెలుసుకోండి

English summary

Digital Payments Danger At Petrol Bunks