డిగ్గిరాజా పంపకాల యవ్వారం

Digvijaya Singh Decided To Give His Property To His First Wife Son

11:02 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Digvijaya Singh Decided To Give His Property To His First Wife Son

రాజకీయ నేతలు అందునా తలపండిన నాయకులు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది. నిజం చెప్పాలంటే, ఎలాంటి సెన్సేషన్ అయినా సరే రాజకీయ నేతల నుంచి వస్తుంటాయి. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు చెందిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. రాజ్యసభ టీవీలో జర్నలిస్టుగా పనిచేస్తున్న అమృతా రాయ్ ని వివాహం చేసుకున్న ఈయన ప్రస్తుతం ఆమెతో కలిసే జీవనం సాగిస్తున్నారు. ఇన్నాళ్లు దిగ్విజయ్ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తితో పాటు పొలిటికల్ లీడర్ గా ఆయన కూడబెట్టిన ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుందన్న దానిపై మధ్యప్రదేశ్ లో రకరకాల ఊహాగానాలు సాగాయి. చివరకు దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చేశాడు.

డిగ్గీరాజా - ఫస్ట్ వైఫ్ కు పుట్టిన జయవర్ధన్ సింగ్ అనే కొడుకు వున్నాడు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తితో పాటు తను సంపాదించిందంతా తన కొడుకు జయవర్ధన్ కే చెందుతుందని ప్రకటించారు. ఇలా చెబుతూనే ఈ వ్యవహారంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంలో తన సెకండ్ వైఫ్ అమృతా రాయే కీలక నిర్ణయం తీసుకుందని డిగ్గీరాజా వివరణ ఇచ్చేశారు. తనకు దిగ్విజయ్ కావాలి తప్ప ఆయన ఆస్తి కాదని అమృతారాయ్ కూడా చెప్పేస్తోంది. ఇలా ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చుకోవడంతో అంతర్గతంగా ఏదో జరుగుతోందని, అయినా రాజకీయ నేతలు మాట్లాడే మాటలకు అర్ధాలే వేరులే కదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక రాజకీయ నేతలు కూడా ఈ విషయమై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ డిగ్గిరాజా పంపకాల యవ్వారం పెళ్ళాం చెబితే వినాలి అన్నట్టు ఉందంటూ కామెంట్స్ పడుతున్నాయి.

English summary

Congress Party Leader Digvijaya Singh announced that his total assets were giving to his first wife son Jayavardan Singh. He said that his second wife Amrita Rai took decision on this issue.