రవితేజకి క్రేజ్ తగ్గిందా!

Dil raju says no to Raviteja

06:58 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Dil raju says no to Raviteja

రవితేజ సినిమాలకి మంచి క్రేజ్ ఉండేది. మాస్ మహరాజ్ గా ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకునే రవితేజ సడన్ గా కిక్ 2 తో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎటువంటి సినిమా అయినా నిర్మాతలను సేఫ్ జోన్ లో ఉంచే హీరో రవితేజ. కానీ కిక్ 2 తో సీన్ రివర్స్ అయింది. దీనికి కారణం ఆయన సన్నబడడం, సరైన కధ లేకపోవడం అని చెప్తున్నారు. కధ రొటీన్ గా ఉండడం కూడా మరో కారణం గా చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇప్పటివరకు రీమ్యూనరేషన్ విషయం లో ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయని రవితేజ తాజా గా దిల్ రాజు తీయబోయే చిత్రం విషయం లో మాత్రం ఫేస్ చేశాడట. రవితేజ 8 కోట్లు అడుగగా 6 కోట్ల కంటే ఒక్క పైసా ఇచ్చేది లేదని నిర్మాత కరాకండి గా చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వేణుశ్రీరాం చెప్పిన కధ దిల్ రాజు కి నచ్చడం, సినిమా తీయడానికి రెడీ కావడం తెలిసిన విషయమే. ప్రస్తుతం రవితేజకి బ్రేక్ పడేలా ఉందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

English summary

Dil raju says no to Raviteja