పవన్‌ ఒప్పుకుంటే ఎంతైనా ఖర్చు పెడతా 

Dil Raju told that he will spend huge amount for Pawan

06:06 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Dil Raju told that he will spend huge amount for Pawan

టాలీవుడ్‌ బ్రాండ్‌ హీరో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. ప్రజల్లో అంతులేనంత క్రేజ్‌ పవన్‌ సొంతం. ఏ హీరోకి లేనంత ఫాలోయింగ్‌ ఒక్క పవన్‌కి మాత్రమే ఉందంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి ఈ హీరోతో సినిమా చెయ్యాలని ఏ హీరోయినైనా, దర్శకుడైనా, నిర్మాతైనా ఉత్సాహం చూపిస్తారు. పవన్‌ తో సినిమా చేస్తే డబ్బుకి డబ్బు, క్రేజ్‌కి క్రేజ్‌ వస్తుందని ఎంతో మంది భావిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే తెలుగులో వరుస హిట్లు నిర్మించిన రికార్డు దిల్‌రాజు సొంతం. మంచి కధలు ఎంచుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక టాప్‌ ప్రొడ్యూసర్‌గా వెలిగిపోతున్నాడు. అయితే దిల్‌రాజు ఇప్పటి వరకు పవన్‌తో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. అందుకే పవన్‌తో ఒక సినిమా చెయ్యాలని దిల్‌రాజు ఫిక్స్‌ అయిపోయాడు. పవన్‌తో సినిమా చెయ్యడం నా యాంబిషన్‌ అంటూ ఇటీవలే సంచలన కామెంట్స్‌ చేశాడు. ఇటీవలే పవన్‌ దగ్గర పర్మిషన్‌ కూడా తీసుకున్న దిల్‌రాజు ప్రస్తుతం పవన్‌ కి సరిపోయే కథని ఎంచుకునే పనిలో ఉన్నాడట. ఒక్కసారి పవన్‌ కథ నచ్చిందంటే ఆ సినిమాకి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతా అని దిల్‌రాజు చెప్తున్నాడు.

Michi Vilas Poll

మీ ఫేవరెట్ హీరో ఎవరు?

English summary

Dil Raju told that he will spend huge amount for Pawan Kalyan movie. Dil Raju said that if Pawan agrred the story I will spend crores for Pawan Movie.