కోలుకుంటున్న బాలీవుడ్ దిగ్గజం

Dilip Kumar Tio Discharge From hospital

11:54 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Dilip Kumar Tio Discharge From hospital

శ్వాససంబంధమైన సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమర్‌(93) త్వరితంగా కోలుకుంటున్నారు. అయితే ఆయనకు పూర్తి స్థాయిలో స్వస్థత చేకూరి ఇంటికి వెళ్లేందుకు మరో నాలుగైదు రోజులు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆయనకు శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో బాంద్రాలోని లీలవతి ఆసుపత్రిలో చేర్చారు. ‘ఆసుపత్రిలో చేరినప్పటితో పొల్చితే ప్తస్తుతం ఆయన పరిస్థితి చాలా మెరుగైంది. త్వరగా కోలుకుంటున్నారు’ అని చికిత్స అందిస్తున్న వైద్యుల బృందంలోని డా.జలీల్‌ పర్కర్‌ తెలిపారు. అలాగే మరో నాలుగైదు రోజుల తరువాత ఆయన్ను ఇంటికి పంపించే అవకాశముందన్నారు. దిలీప్‌కుమార్‌ త్వరగా కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన భార్య, అలనాటి నటి సైరాభాను తెల్పారు. సెంచరీ కొట్టడానికి దగ్గరలో వున్న దిలీప్ కుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

సౌందర్య చనిపోతుందని వాళ్ళ తండ్రికి ముందే తెలుసట!

1720 రూపాయలకు తల్లిని చంపేసాడు

పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు

English summary

Legendary Actress Of Bollywood Dilip Kumar was Admitted in Hospital with some Health problem. Presently his age was 93 years and he is going to discharge from hospital within two days.