కుమారి 21 ఎఫ్‌ తో దిల్‌రాజు భలే ఖుషి

Dilraju happy with result of kumari 21f

04:41 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Dilraju happy with result of kumari 21f

స్టార్‌ హీరోల సినిమాలను తీయడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్న సినీ నిర్మాత దిల్‌రాజు కొంత కాలంగా తాను నిర్మించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో దిల్‌రాజు కాస్త స్లో అయ్యాడు. దీంతో తన ఫీల్మ్‌ డిస్ట్రిబ్యుషన్‌ రంగంలోకి తిరిగి అడుగుపెట్టాడు దిల్‌రాజు. దిల్‌రాజు తాజాగా దర్శకుడు సుకుమార్‌ సమర్పణలో వచ్చిన లో బడ్జెట్‌ మూవీ 'కుమారి 21ఎఫ్‌' ఈ చిత్రం తాలుకు నైజాం రైట్సను 2.5 కోట్లకు కొనుగోలు చేసాడు దిల్‌రాజు. కుమారి 21 ఎఫ్‌ సినిమా బక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిటంతో దిల్‌రాజు కు ఇప్పటికే కోటి రూపాయల లాభాన్ని గడించాడు. ఈ చిత్రం సినిమా ధియేటర్ల నుండి వెళ్ళేలోపు దిల్‌రాజు కు మూడు,నాలుగు రేట్లు లాభాన్ని గడించి పెట్టడం ఖాయంగా కనిపి స్తోంది. దీంతో దిల్‌రాజు మంచి ఉత్సాహం మీదున్నట్లు తెలుస్తోంది.

English summary

Star Producer Dil Raju is happy the film "Kumari 21F".He purchased the nijam film distribution rights of the movie. Movie gets good collections all over andhra pradesh and telangana.Star Director Sukumar Is the producer of Kumari21F, movie