ఆ ఒక్క సీన్ కోసమే

Dilwale Song Making Video

10:25 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Dilwale Song Making Video

బాలీవుడ్ వాళ్లకు ఏది హైలెట్ చేయాలో , దీనికి క్రేజ్ తేవాలో బాగా తెల్సు. పైగా బాలీవుడ్‌ హిట్‌ పెయిర్‌ గా నిలిచిన షారూఖ్‌-కాజోల్‌ జంట అంటే ప్రేక్షకులకు భలే కిర్రెక్కుతుంది. వీళ్ళ మీద ప్రయోగం చేస్తే దానికి వచ్చే రెస్పాన్స్ వేరు. ఎందుకేంట ఆన్‌ స్క్రీన్‌ పై వీరిద్దరి రొమాన్స్ కి వున్న క్రేజ్ ఆలాంటిది మరి... అయితే దాదాపు 9ఏళ్ల విరామం తర్వాత ఇటీవల వీరిద్దరూ కలిసి మళ్లీ నటించిన ‘దిల్‌వాలే’ చిత్రం గత డిసెంబర్‌ నెలలో విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

దిల్‌వాలే చిత్రంలోని ‘టుకుర్‌ టుకుర్‌’ పాటకు సంబంధించిన మేకింగ్‌ వీడియో అది. ఆ పాట కోసం షారూఖ్‌- కాజోల్‌ జంటతోపాటు యువ జంట వరుణ్‌ధావన్‌- కృతిసనన్‌లు ఎంతగా శ్రమించారో వివరిస్తూ, ఆ చిత్ర దర్శకుడు రోహిత్‌ శెట్టి ఈ వీడియోని విడుదల చేశాడు. పాట చిత్రీకరణలో భాగంగా షారూఖ్‌.. కాజోల్‌ని అనుకోకుండా ముద్దు పెట్టుకుంటాడు. ఇక ఆ సీన్ భలే కిక్కిస్తోందట. అందుకే ఈ ఒక్క సీన్‌ వల్ల ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌ హల్‌చల్‌ చేస్తోందట. ముద్దు సీన్ వీరిద్దరి మధ్యా కొత్త కాకున్నా, సుదీర్ఘ విరామం తర్వాతేమో బానే పండిందని అంటున్నారు.

English summary