రణవీర్ కి  మంగేష్కర్‌ అవార్డు

Dinanath Mangeshkar Award To Ranveer Singh

10:08 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Dinanath Mangeshkar Award To Ranveer Singh

బ్యాండ్‌ బాజా బారాత్‌తో బాలీవుడ్‌లో 2010లో తెరంగేట్రం చేసిన రణ్‌వీర్‌, ఆ తర్వాత రామ్‌లీలా, దిల్‌ ధడక్‌నే దో, లుటేరా, బాజీరావ్‌ మస్తానీ సినిమాలతో ఇండస్ట్రీలో మంచి మార్కులు కొట్టేసాడు. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో రణ్‌వీర్‌ తనదైన శైలిలో మంచి పేరు సంపాదించుకున్న నేపథ్యంలో ఆయనకు దీనానాథ్‌ మంగేష్కర్‌ అవార్డు ఇచ్చి సత్కరించనున్నట్లు ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ ప్రకటించారు. రణ్‌వీర్‌ మంచి వ్యక్తిత్వం కల, గొప్ప నటుడని, అతను ఎక్కడున్నా తన చుట్టూ ఉన్న వారంతా సంతోషంగా ఉండాలనుకుంటాడని, తన తండ్రి పేరున ఇస్తున్న గౌరవ పురస్కారాన్ని రణ్‌వీర్‌ అందుకుంటున్నందుకు సంతోషంగా ఉందని లత తెలిపారు. లత తండ్రి దీనానాథ్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 24న పుణెలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని లతా మంగేష్కర్‌ చేతుల మీదుగా రణ్‌వీర్‌ అందుకుంటాడు.

English summary

Ranveer Singh will be honoured with Dinanath Mangeshkar Award in April, says melody queen Lata Mangeshkar.This year, the award will be bestowed upon Ranveer at a function to be held in Pune on April 24.