' గరం'   బన్నీ కోసం పుట్టిందా ....

Director About Garam Movie

10:38 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Director About Garam Movie

ఆది తో వస్తున్న ' గరం' కథ బన్నీ కోసం రెడీ చేసారా , కధ వినడం కూడా అయిందా. మరి ఎందుకు ఇలా జరిగింది. ఇంతకీ ఈ విషయం చెప్పింది శ్రీనివాస్‌ గవిరెడ్డి. ఇతనేవరంటే కొంచె వివరంగా చెప్పాల్సిందే. ఇతను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని. ఇక పూరి జగన్నాథ్‌ పుట్టిన ఊర్లోనే పుట్టాడు. డిగ్రీ డిస్‌కంటిన్యూ చేసేసి , సినిమా డైరెక్టర్‌ కావాలనే పిచ్చితో కుటుంబ సభ్యుల ముందు విషయం చెప్పాడట. ‘ఎందుకు పనికిరాకుండా పోతావ్‌’ అని తండ్రి, ‘నా బిడ్డ గొప్పవాడవుతాడని’ తల్లి,' అన్నయ్య ఏం చేసినా మంచే జరుగుతుందని' చెల్లెళ్లు. ఇలా ఎవరి భాష్యం వారు చెప్పేశారు. ఆత్మవిశ్వాసంతో సినీ రంగానికి వెళ్ళిన శ్రీనివాస్ సినిమా కష్టాలన్నీ రుచి చూసాడు. భవిష్యత్తు కోసం ఓపిగ్గా నిలబడిన ఇతనికి అల్లు అర్జున్ సపోర్ట్‌ లభించింది. కట్‌చేస్తే, రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా గురించి, శ్రీనివాస్‌ గవిరెడ్డి మాట్లాడుతూ పలు అంశాలు వివరించాడు.

'గరం' కథ నాదే. దీనిని మొదట బన్నీకి చెప్పాను. అయితే ఆయనకి నచ్చింది కానీ డేట్స్‌ లేకపోవడంతో కుదరలేదు. ఆ కథని ఆదితో చేస్తున్నాం. మొదటి కథ బన్నీకి చెప్పడంతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఇప్పుడు ఏ హీరోకైనా ధైర్యంగా కథ చెప్పగలను ’’ అంటూ కొత్త దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పాడు. మరి బన్నీతో మిస్సయిన సినిమా మళ్ళీ ఏ రూపంలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తాడో చూడాలి.

English summary

Young Hero Aadi's upcoming movie Garam director says that this movie story was first said to Stylish Star Allu Arjun but due to lack of dates he rejected this movie and later this story was said to Aadi. This movie was made with full of entertainment and this movie was released in this february