యంగ్ టైగర్ కి బాల బంపర్ ఆఫర్

Director Bala bumper offer to Ntr

04:52 PM ON 5th August, 2016 By Mirchi Vilas

Director Bala bumper offer to Ntr

అవునా అంటే అవుననే అంటున్నారు. ఇంతకీ బాల ఎవరంటే తమిళ దర్శకుడు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలతో సినిమా తెరకెక్కించడంలో బాల సిద్ధహస్తుడు. ఈ క్రమంలో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించి జాతీయ అవార్డులు సైతం గెలుచుకున్నాడు. సాధారణంగా బాలతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడుతుంటారు. అటువంటి బాలానే యంగ్ టైగర్ కి బంపరాఫర్ ఇస్తున్నాడట. వాస్తవానికి టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రాల విజయంతో మాంచి ఊపుమీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని తెగ శ్రమిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కు వచ్చిన స్పందన చూసిన వాళ్లు ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనుకుంటున్నారు.

ఈ సినిమా ఇంకా విడుదల కానప్పటికీ ఎన్టీఆర్ తరువాతి సినిమాపై టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తిని రెట్టింపు చేస్తూ తమిళ దర్శకుడు బాలతో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడనే వార్త అటు కోలీవుడ్ నూ, ఇటు టాలీవుడ్ లోనూ సంచలనం సృష్టిస్తోంది. జనతా గ్యారేజ్ లో నటిస్తున్న మోహన్ లాల్.. ఇటీవల ఒక సందర్భంలో బాలని కలిశాడని, తమ చిత్రం షూటింగ్ గురించి, ఎన్టీఆర్ గురించి చర్చించాడని తెలిసింది. మోహన్ లాల్ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెబుతుంటే, బాల ఆశ్చర్యపోవడం వంతయిందట. ఎన్టీఆర్ తో సినిమా తీస్తే బాగుంటుందని బాల ఆలోచిస్తున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బాలతో ఎన్టీఆర్ జతకలిస్తే అది కచ్చితంగా సంచలనం సృష్టిస్తుందని టాక్. మరి యంగ్ టైగర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

English summary

Director Bala bumper offer to Ntr