రష్మీని మోసం చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

Director cheated Rashmi Gautam

10:45 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Director cheated Rashmi Gautam

ఇటీవల కాలంలో బుల్లితెర నుండి వెండితెరపై మెరిసిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వాళ్ళల్లో జబర్దస్త్ వంటి కామెడీ షోలో హాట్ అందాలతో యాంకరింగ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న రష్మీ గౌతమ్ ని ప్రధానంగా ప్రస్తావించాలి. ఈ బ్యూటీ తన అడుగులు వెండితెర వైపు వేసి, గుంటూర్ టాకీస్ అనే చిత్రంతో ఆడియెన్స్ ను తన హాట్ అందాలను చూడటానికి థియేటర్స్ వరకు రప్పించగలిగింది. ఈవిధంగా తొలి సక్సెస్ కొట్టిన ఈ హాట్ బ్యూటీ, ఆ తరువాత వెంటనే అంతం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా రష్మీ గౌతమ్ తనను ఒకతడు మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు.

ఇంతకీ రష్మీ గౌతమ్ ను ఎవరు మోసం చేశారంటే, అంతం సినిమా డైరెక్టర్ కళ్యాణ్. అవును ఇది నిజమట. ఈ విషయం స్వయంగా రష్మీ వెల్లడించింది. ఇక అంతం సినిమా ప్రమోషన్స్ లో రష్మీ ఎందుకు పాల్గొనలేదు అనే ప్రశ్నకు అమ్మడు దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది. అంతం సినిమా డైరెక్టర్ కళ్యాణ్ తనకు చెప్పిన కథ ఒకటి, తాను తీసిన కథ మరొకటి అంటూ ఆ దర్శకుడిపై విరుచుకుపడింది. నాకు కనీసం చెప్పకుండానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ సినిమాలో ఉండదు. ఎందుకిలా చేసారు అంటే యూత్ ని ఆకట్టుకోవడానికని డైరెక్టర్ తనతో చెప్పాడంటూ వాపోతోంది రష్మీ.

ఇలా తనను ఒక డైరెక్టర్ మోసం చేశాడంటూ చెప్పిన రష్మీ గౌతమ్ పై టాలీవుడ్ వర్గాలు జాలిపడుతున్నారు. ఇక ఇప్పటికే అంతం సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమాలో రష్మీది చాలా తక్కువ నిడివి గల రోల్ అట.

English summary

Director cheated Rashmi Gautam