'హ్యాపీడేస్' డైరెక్టర్ ఇకలేరు

Director Garry Marshall Dies At 81

11:39 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Director Garry Marshall Dies At 81

హిట్ చిత్రాలకు ఆయనకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచి, 'ది లూసీ', 'ది డిక్ వాన్ డైక్', 'హ్యాపీ డేస్' వంటి పలు టీవీ షోలను రూపొందించి తన స్థానాన్ని పదిలపరచు కోవడమేకాక హాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దిగ్దర్శకుడు గ్యారీ మార్షల్ కన్నుమూశారు. నిమోనియాతో బాధపడుతూ గుండెపోటుకు గురవడంతో లాస్ఏంజిల్స్ లోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 81 ఏళ్ల గ్యారీకి భార్య బార్బరా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1970 దశకంలో సిట్యుయేషనల్ కామెడీ షో 'హ్యాపీడేస్' ఆయనకు మంచి పేరు తెచ్చింది. దాదాపు దశాబ్దం పాటు అమెరికా టీవీ రంగాన్ని ఈ షో ఒక ఊపు ఊపింది. 'ద ఆడ్ కపుల్', 'మార్క్ అండ్ మిండీ' వంటివి ఆయన పేరును మరింత పదిలం చేశాయి. 'ప్రెటీ ఉమన్', 'ది ప్రిన్సెస్ డైరీస్' వంటివి హిట్ మూవీలుగా నిలిచాయి. న్యూయార్క్ లో జన్మించిన గ్యారీ జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఒక పత్రికలో సినీ గాసిప్స్ రాసేవారు. ఈ గాసిప్స్ అద్భుతంగా పండటంతో హాస్య నటుడు జాయ్ బిషఫ్ ఆయన్ని లాస్ ఏంజిల్స్ తీసుకువెళ్లి తన టాక్ షో కోసం డైలాగ్ రైటర్ గా నియమించుకున్నారు.ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. కున్నారు. గ్యారీ మృతిపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి:జల్సాల వైఫ్ కోర్కెలు తీర్చాడు -- ఇద్దరూ కటకటాల పాలయ్యారు

ఇవి కూడా చదవండి:మిల్క్ బ్యూటీకి అడిగినంతా ఇప్పిస్తున్నడైరెక్టర్

English summary

Hollywood Popular Director Garry Marshall passes away at the age of 81. He directed many super hit films in Hollywood.