ఆ దర్శకుడు అత్యాచారం చేసాడా ?

Director held for raping Pakistani actor

01:13 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Director held for raping Pakistani actor

సినిమాలలో నటించాలని ఆశతో ఎన్నొ మోసాలకు గురవుతుంటారు. వాళ్ళ ఆశలనే ఆయుధంగా చేసుకుని నమ్మించి మోసం చేసేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి సంఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి వంచించడమే కాకుండా డబ్బులు కూడా దోచుకున్నాడు ఓ దర్శకుడు. పాకిస్తాన్‌ కు చెందిన ఓనటి (30) , తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించమని అడగగా, బెదిరిస్తున్నారని భోజ్‌పూరి దర్శకుడు శ్యామ్‌ చరణ్‌ యాదవ్‌ (42) మరో ఇద్దరు సహ దర్శకులు బబ్లూ, టైగర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అవకాశాల పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. దీంతో దర్శకుడిని పోలీసులు అరెస్ట్‌ చేసారు.

కధనం ప్రకారం మూడేళ్ళ క్రితం ఓ సినిమా ఫంక్షన్‌లో దర్శకుడు శ్యామ్‌ కి పాకిస్తానీ నటి పరిచయం అయింది. శ్యామ్‌ మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి, సినిమా నిర్మాణానికి 35.80 లక్షలు అప్పుగా తీసుకుని, పలుసార్లు ఆమెపై లైంగిక దాడి చేసాడు. సినిమా చాన్సులు లేకపోవడంతో ఆమె ఆ దర్శకుడిని గట్టిగా నిలదీసింది. దాంతో శ్యామ్‌, అతని సహచరులు బబ్లూ, టైగర్‌ లతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించడంతో బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందుతుడైన శ్యామ్‌ ని అరెస్ట్‌ చేశామని డిఎస్పీ బావ్చే తెలియజేసారు. మిగిలిన వారిరువురు పరారిలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

English summary

in this article Director held for raping Pakistani actor. Bhojpuri film director has been arrested by the Mira Road police for cheating and raping a small time female actor from Pakistan.