క్రిష్-రమ్యల మ్యారేజ్ డేట్ కన్ఫర్మ్

Director Krish and Ramya marriage date fixed

11:12 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Director Krish and Ramya marriage date fixed

కేవలం నాలుగు మూవీలతోనే క్రిష్ తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు నందమూరి నటసింహం వందో సినిమాకు డైరెక్ట్ చేస్తున్న క్రిష్ ఓ ఇంటివాడు అవుతున్నాడు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ప్రస్తుతం బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిని డైరెక్ట్ చేస్తున్న నేపథ్యంలోనే, పెళ్లి నిశ్చయమైంది. ఆగస్ట్ 8న క్రిష్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రమ్యను వివాహం చేసుకోనున్న క్రిష్ పెళ్లి పనుల్లో బిజీగా బిజీ అయ్యాడు. పెద్దల అనుమతితో నిశ్చయింపబడిన ఈ వివాహానికి ఆగస్టు 8 తెల్లవారుఝామున 2:28 నిమిషాలకు సుముహూర్తంగా నిర్ణయించారు.

హైదరాబాద్ శివారు గండిపేట దగ్గరలోని గోల్కొండ రిసార్ట్ లో వీరిద్దరూ ఒక్కటికానున్న నేపథ్యంలో వీరి వివాహనికి తెలుగు చిత్రపరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. క్రిష్ దర్శకుడు కాగా.. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ అపోలో హాస్పటల్ లో డాక్టర్. ఇక వీరిద్దరి జోడీ గురించి సినీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు.

English summary

Director Krish and Ramya marriage date fixed