బాలకృష్ణ చేసిన పనికి కంటతడి పెట్టుకున్న క్రిష్(వీడియో)

Director Krish get emotional in Balakrishna birthday celebrations

06:35 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Director Krish get emotional in Balakrishna birthday celebrations

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం బాలయ్య క్యాన్సర్ ఆసుపత్రి కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టడానికి అమెరికా వెళ్ళడంతో ఆయన కుమార్తె బ్రాహ్మణి, బాలయ్య 100వ చిత్రం దర్శకుడు క్రిష్, కొందరు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో దర్శకుడు క్రిష్ తన వంతుగా మాట్లాడుతూ బాలకృష్ణ లాంటి గొప్ప వ్యక్తిని తానింతవరకూ చూడలేదని, ఆయనో నిత్య విద్యార్థి అని అన్నారు. అలాగే ఆసుపత్రి గురించి మాట్లాడుతూ ‘ఈ ఆసుపత్రిలో ప్రతిదీ నాకు తెలుసు. ఈ కారిడార్ లో చాలా సార్లు నడిచి మా అమ్మను చూడటానికి వెళ్లాను.

ఇదే హాస్పిటల్ లో మా అమ్మకు వైద్యం చేయించాను. మా అమ్మను నేను అమ్మలా చూసుకోవడం గొప్ప కాదు. కానీ ఇక్కడున్న స్టాఫ్ మా అమ్మను అమ్మలా చూసుకున్నారు. అలాగే ఇలాంటి గొప్ప ఆసుపత్రిని నిర్వహిస్తున్న బాలకృష్ణ గొప్ప వ్యక్తి. పైగా దీనికోసం ఫండ్స్ కలెక్ట్ చేయడానికి అమెరికా వెళ్ళారు. ఆయనకు నా హ్యాట్సాఫ్’ అంటూ మాట్లాడుతున్నప్పుడు ఆ భావోద్వేగంతో క్రిష్ కళ్ళు నీళ్ళతో నిండి చెమడ్చాయి.

English summary

Director Krish get emotional in Balakrishna birthday celebrations