కమనీయం-కళ్యాణం(ఫోటోలు)

Director Krish marriage photos

12:57 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Director Krish marriage photos

'గౌతమీ పుత్ర శాతకర్ణి'తో హై రేంజ్ కి చేరిన ప్రముఖ దర్శకుడు క్రిష్(జాగర్లమూడి రాధాకృష్ణ) కు వైభవంగా మ్యారేజ్ అయింది. డా.రమ్యసాయితో ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో ఘనంగా వివాహం జరిగింది. నా సినీ జీవితం గమ్యంతో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు రమ్యంగా మొదలవుతోంది... మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్ పంపిన ఆహ్వానాన్ని అందుకొని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు. మేళతాళాలు, వేదమంత్రాల మధ్య రాత్రి 9గంటల 5నిమిషాలకి జీలకర్ర, బెల్లం తంతుతో కొత్త జంట ఒక్కటైంది.

ప్రముఖ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, నాగచైతన్య, రామ్, గోపీచంద్, కార్తీ, శ్రీకాంత్, సుమంత్, సుధీర్ బాబు, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, ఎస్.ఎస్. రాజమౌళి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, ప్రగ్యాజైస్వాల్, తెదేపా నేత నారా లోకేష్, లక్ష్మీప్రసన్న, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేష్ బాబు, గొల్లపూడి మారుతీరావు, అల్లు అరవింద్, కోట శ్రీనివాసరావు, రావికొండలరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, తనికెళ్ళ భరణి తదితరులు హాజరయ్యారు. తమిళ, హిందీ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన జంటని ఆశీర్వదించారు. దీంతో ఒకటే సందడి. ఇక పెళ్లయింది కదా. హనీమూన్ కూడా పూర్తయ్యాక, బాలయ్య వందో సినిమా శాతకర్ణి పై దృష్టి పెట్టనున్నాడు క్రిష్.

పెళ్లి ఫోటోలు కింద స్లైడ్ షోలో చూడవచ్చు..

1/11 Pages

English summary

Director Krish marriage photos