ఇంట్లో డబ్బులు కొట్టేసిన క్రిష్

Director Krish stolen money in his home

12:24 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Director Krish stolen money in his home

అవునా, తీసింది నాలుగు చిత్రాలే అయినా, మంచి ఇమేజ్ తెచ్చుకున్న క్రిష్ ఇలా ఇంట్లో డబ్బులు కొట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా ఇలా చేసినందుకు తన్నులు కూడా తిన్నాడు... దానికి కూడా ఓ కారణం ఉంటుందిగా... అదేమిటో తెలుసుకుందాం. బాలయ్య వందో సినిమా చేయటానికి చాలామంది దర్శకులు పోటీపడ్డారు. అయితే అవకాశం దర్శకుడు క్రిష్ కే దక్కడానికి కారణం కథే. గౌతమి పుత్ర శాతకర్ణ చిత్రాన్ని బాహుబలిని తలదన్నేలా తీస్తానని ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో క్రిష్ చెప్పాడు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా తప్పులు చేయడం సహజం... వాటిని ధైర్యంగా ఒప్పుకోవడం కూడా గ్రేటే. ఇంతకీ అసలు విషయం ఏమిటో క్రిష్ మాటల్లో విందాం...

'తొమ్మిదో తరగతి చదివే రోజుల్లో 'శివ' సినిమా రిలీజైంది. అప్పుడు  ఇంట్లో డబ్బులు కొట్టేసి ‘శివ’ సినిమాకు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాను. ఇంట్లోకి వచ్చి తెలీనట్లు భయంగానే కూర్చున్నా. అందరితో కూర్చుని భోజనం చేస్తుంటే ‘సినిమా ఎలా ఉంది’ అని నాన్న అడిగారు. తెలీదే అన్నట్లు ఫేస్‌ పెట్టాను. అబద్ధం చెప్పానని నాన్న కొట్టారు' అని క్రిష్ వివరించాడు. 

1/8 Pages

అది గొప్ప తెలుగు వీరుడి కధ...


'గౌతమీపుత్ర శాతకర్ణి అనే గొప్ప వీరుడి కథ అది. గ్రేట్‌ థాట్‌ ఉన్న వ్యక్తి. దేశంలోని అనేక గణరాజ్యాల్ని ఏకతాటి పైకి తెచ్చి ఏకం చేయటానికి ఆయన కంకణం కట్టుకున్న రోజు ఉగాది అయ్యింది. గొప్ప ఆలోచనలే కాదు, గొప్ప మనసున్న ఆ మహాపురుషుడు మన తెలుగువాడే కావటం విశేషం. ఇలాంటి వ్యక్తి కథను తీసుకెళ్లాక బాలకృష్ణ హ్యాపీగా ఫీలయ్యారు. కథ చెబుతుంటే ఆయన ఎమోషన్‌ అయ్యారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని చేస్తానన్నారు. ఒకవేళ బాలయ్య చేయకుంటే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథను పక్కనబెట్టే వాడ్ని' అని క్రిష్ చెప్పుకొచ్చాడు. 

English summary

Director Krish stolen money in his home. Director Krish childhood memories and issues.