క్రిష్ పెళ్లికొడుకాయేనే

Director Krish To Get Marry With Doctor Ramya

01:44 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Director Krish To Get Marry With Doctor Ramya

తీసింది నాలుగు సినిమాలే అయినా వంద సినిమాల అనుభవం కొట్టేసి, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్రా శాతకర్ణి చిత్రానికి దర్శక చాన్చ్ అందిపుచ్చుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ఈ ఏడాది పెళ్లికొడుకు కాబోతున్నాడట. అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఇంతకీ క్రిష్.. హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకోనున్నాడని వినికిడి.

క్రిష్ బ్రదర్ మ్యారేజ్ చేసుకుని యూఎస్ లో సెటిలైపోయాడు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఫ్యామిలీ సభ్యుల నుంచి క్రిష్ పై ఒత్తిడి పెచేస్తున్నారట. ఈ క్రమంలో గతేడాది క్రిష్ మ్యారేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి అలాంటిదేమీలేదని ఆయన తోసిపుచ్చినప్పటికీ, జాతీయ అవార్డ్ తీసుకోవాలన్న అతని కోరిక కంచె మూవీతో నెరవేరడంతో మ్యారేజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. హైదరాబాద్ కు చెందిన రమ్య... వృత్తిరీత్యా ఆమె డాక్టర్. ఇదేమీ లవ్ మ్యారేజ్ కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్లేనని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలో క్రిష్ ఓ ఇంటివాడు అయిపోతాడని అతని ఇంట సంబరం మొదలైందట.

ఇవి కూడా చదవండి:అల్లు వారబ్బాయితో లావణ్య త్రిపాఠి పెళ్లి!

ఇవి కూడా చదవండి:ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

English summary

Tollywood Crazy Director was became famous with his way of films and he became one of the top director in Tollywood and now a recent news that he was going to tie a knot with Hyderabadi doctor Ramya.