పెళ్లి శుభలేఖలో కూడా వైవిధ్యం చూపించిన క్రిష్!

Director Krish wedding card

12:37 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Director Krish wedding card

గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్, కంచె వంటి చిత్రాలతో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న క్రిష్ తన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించాడు. మాస్ కమర్షియల్ ఫార్మూలాలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు కొత్త అధ్యయనం నేర్పించిన ఘనత క్రిష్ ది. అందుకే కంచె చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు కూడా దక్కించుకోగలిగాడు. ఇదిలా ఉంటే ఈ నెల 7న క్రిష్ వివాహం డాక్టర్ రమ్యతో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిష్ రూపొందించిన పెళ్లి శుభలేఖ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అచ్చ తెలుగులో బాపు ఫాంట్ తో ఈ శుభలేఖను క్రిష్ డిఫరెంట్ గా తయారు చేయించారు.

సినిమాల్లో మాదిరిగానే తన శుభలేఖలో కూడా ప్రదర్శించిన వైవిధ్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం క్రిష్ నందమూరి బాలకృష్ణతో 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం తెరకెక్కిస్తున్నాడు

1/6 Pages

English summary

Director Krish wedding card