సాగర్‌ చేతికి  ‘కాఫీ విత్‌ మై వైఫ్‌’

Director Madan About His Garam Movie

10:12 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Director Madan About His Garam Movie

రాజేంద్ర ప్రసాద్ హీరోగా వినూత్న కధాంశం ఓ వచ్చిన ‘ఆ నలుగురు’ కథ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. కధే ఆ సిన్మాను నడిపించింది. మనుషుల మధ్య అహాన్ని చూపిస్తూ వచ్చిన ‘పెళై్లన కొత్తలో’ విజయాన్ని అందుకుంది. ఇంకా, ‘గుండె ఝల్లుమంది’, ‘ప్రవరాఖ్యుడు’ లాంటి చిత్రాలతోనూ ఆకట్టుకొని, తాజాగా ఆది కథానాయకుడిగా ‘గరం’ తెరకెక్కించిన 'మదన్' అంటే అందరికీ ఎరుకే. మదన్ తీసిన 'గరం' ఈ నెల 12న ప్రేక్షకుల ముందు కొస్తున్న సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మానవీయ కోణాన్ని స్పృశించే చిత్రాలు తీస్తూ, కమర్షియల్ టచ్ గల 'గరం' మన ముందుకు తెచ్చాడు . 2014లోనే ఈ సినిమా సెట్స్‌పైకి తీసు కేల్లినప్పటికీ, పెళ్లితో పాటు ఆ తర్వాత అనుకోకుండా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం వల్ల సినిమా కాస్త ఆలస్యమైంద ని మదన్ వివరించాడు. సినిమా కథలు సమకాలీన పరిస్థితుల్ని ప్రతిబింబించేలా ఉండాలని చెబుతున్న మదన్ ‘కన్యాశుల్కం’ కథను ఇప్పుడు తీస్తామంటే కష్టమేనని విశ్లేషించాడు. వేరే వారికి కూడా కధలు రాసి ఇవ్వవచ్చని మదన్ చెబుతూ, తాజాగా ‘కాఫీ విత్‌ మై వైఫ్‌’ కథను సాగర్‌ అనే దర్శకుడికి ఇచ్చా. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని వివరించాడు.

English summary

Garam Movie Director Madan says that Garam movie was a complete entertainer .He says that this movie shooting was started in 2014 but due to some problems this movie was shooted late. In this movie Hero Aadi and Heroine Adah Sharma Acted as hero heroines . Directed by Madan and Produced by M Rajkumar. music composed by Agasthya.