సినిమా ఛాన్స్ కోసం ట్రై చేసే వారికి డైరెక్టర్ మారుతి బంపరాఫర్!

Director Maruthi bumper offer for movie lovers

06:54 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Director Maruthi bumper offer for movie lovers

ఈరోజుల్లో, బస్ట్ స్టాప్, ప్రేమ కధా చిత్రం, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు మారుతి. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ చిన్న నిర్మాతలకు అవకాశాలు ఇస్తూ సినిమాలు తీస్తున్నారు. ఈ మధ్య మురళీకృష్ణ ముడిదాని అనే కొత్త దర్శకుడితో 'గుడ్ సినిమాస్' బ్యానర్ పై తెరకెక్కిన 'రోజులు మారాయి' చిత్రానికి కథ అందించింది మారుతియే. మళ్ళీ ఇప్పుడు... టాలెంటెడ్ డైరెక్టర్ కొత్త దర్శకులను ప్రోత్సహించడానికి షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్ ను ప్రకటించారు. సినిమాల పట్ల తపన, మంచి అభిరుచి ఉన్న దర్శకులు, నటీనటులు సరికొత్త షార్ట్ ఫిలిమ్ తీసి కాంటెస్ట్ లో గెలిస్తే వాళ్లకు తనతో కలిసి పనిచేసే అవకాశం ఇస్తానని ప్రకటించారు.

ఈ కాంటెస్టును త్వరలోనే లాంచ్ చేస్తామని, మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. సినిమాల కోసం ట్రై చేస్తున్న వారికి ఇది కచ్చితంగా మంచి అవకాశమని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మారుతి తెలియజేసిన వెంటనే ట్రై చేసేయండి.

English summary

Director Maruthi bumper offer for movie lovers