నాగ్ కి ఆరకంగా మారుతి షాకిచ్చాడు

Director Maruthi Shocks Nagarjuna

10:36 AM ON 13th August, 2016 By Mirchi Vilas

Director Maruthi Shocks Nagarjuna

ఈమధ్య కొన్ని సినిమాలకు, కొందరు హీరోలకు సంబంధించి అనుకున్న విధంగా జరగడం లేదు. ఎదో అడ్డంకి వెంటాడుతోంది. ఈకోవాలోనే అక్కినేని వారసుడు అఖిల్ పరిస్థితి తయారయింది. ఈ కుర్ర హీరో సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ, నాగార్జున వంటి టాప్ హీరో అండదండలు ఉన్నప్పటికీ అఖిల్ కి ఇంకా బేస్ ఏర్పడలేదు. వివి వినాయక్ వంటి మాస్ డైరెక్టర్ తో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. అప్పటినుంచి రెండో సినిమా ఫైనలైజ్ చేయడానికి అష్టకష్టాలు పడుతున్నాడు.

అఖిల్ రెండో సినిమాకు తొందరేమీ లేదని నాగార్జున చెప్తున్నప్పటికీ.. తగిన డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లుగా టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. తాజాగా, బాబు బంగారం డైరెక్టర్ మారుతి అయితే తన కుమారుడితో ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించగలడని భావించిన నాగ్.. మారుతి దగ్గరకు రహస్య రాయబారం పంపినట్లు ఇన్ సైడ్ టాక్. అయితే, ఈ రాయభారం అందుకున్న మారుతి బాబు బంగారం రిలీజ్ అయ్యాక దీని గురించి ఆలోచిస్తానని సమాధానం ఇవ్వడంతో.. నాగ్ షాక్ తిన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నాగ్ అంతటి అగ్ర హీరో అడిగితే ఆలోచిస్తానని సమాధానం చెప్పడం ఏమిటని కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే మారుతి ఇలా సమాధానం చెప్పడం వెనుక అక్కినేని కుటుంబాన్ని తక్కువ చేయడం కాదని, ఎప్పటి నుంచో అల్లు అర్జున్ తో సినిమా చేయాలని మారుతి అనుకుంటున్నాడని, మరోవైపు అల్లు అర్జున్ సైతం మారుతితో పనిచేయడానికి ఉత్సాహంతో సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడని.. అందుకే బాబు బంగారం రిజల్ట్ చూసి తన తరువాతి ప్రాజెక్టు గురించి మారుతి ఆలోచిస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. అయితే, బాబు బంగారం గురించి ఇప్పుడు డిఫెరెంట్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అనుకున్న రేంజ్ లో సినిమా లేదని అంటున్నారు. అదేం కాదు సినిమా బానే ఉందని కొందరు వాదిస్తున్నారు. మారుతి ఎలా వ్యవహరిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ పాపులర్ యాంకర్!

ఇవి కూడా చదవండి:చిన్న పిల్లాడితో లిప్ లాక్.. నయన్ పై మహిళా సంఘాల సీరియస్

English summary

Youthful director Maruthi shocks King Akkineni Nagarjuna by saying that he was busy to make movie with young hero akhil.