నందినీ రెడ్డి ఎందుకు ఏడిచింది?

Director Nandini Reddy Press Meet

11:27 AM ON 29th February, 2016 By Mirchi Vilas

Director Nandini Reddy Press Meet

అవును, ఒకోసారి పరిస్థితి కల్సివచ్చినా,  ఒక్కోసారి పని అయిపోయాక అది అప్పుడు ఎందుకు చేసామా అని బాధ  పడడం సహజం. మరి చేసిన తప్పు వలన జరిగే నష్టం కూడా ఎక్కువే వుంటుంది. తరచూ ఆ ఘటన గుర్తొస్తుంది. సరిగ్గా దర్శకురాలు నందినీరెడ్డి విషయంలో అదే జరిగింది.  ఆమె తాజాగా దర్శకత్వం వహించిన  ‘కల్యాణ వైభోగమే’ చిత్రంలో నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటించారు. కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకొస్తున్న తరుణంలో విలేకరులతో నందినీరెడ్డి మాట్లాడింది. వాస్తవానికి ‘‘అలా మొదలైంది’ తర్వాత నేను చెయ్యాల్సిన రెండో సినిమా ఇది. మొదటి సక్సెస్‌ను నిలబెట్టుకోవాలంటే ఫలానా జోనర్‌ సినిమానే చెయ్యాలంటూ పరిశ్రమలో కొందరు చెప్పిన మాటలు నమ్మి భయానికి గురయ్యాను. ఇంకో ఆలోచన లేకుండా ‘జబర్‌దస్త్‌’ చేశా. పైగా చెయ్యకూడని టైమ్‌లో నేను చేసిన సినిమా ‘జబర్‌దస్త్‌’. తప్పు తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది’’ అని నందినీరెడ్డి వివరించారు.' ఆ సినిమా రివ్యూల్లో నన్ను తిట్టిన విధానం చూసి ఏడ్చేశాను. నాకు ‘క్వీన్’ మూవీ అంటే చాలా ఇష్టం. ఆ చిత్ర దర్శకుడు తీసిన ‘శాన్‌దార్‌’ చూసి అతన్ని బాగా తిట్టుకున్నా. అ తర్వాత నన్ను జనాలు ఎందుకు తిట్టుకున్నారో అర్థం చేసుకున్నా' అని  చెప్పింది.

నందిని రెడ్డి తెరకెక్కించిన కల్యాణ వైభోగమే చిత్రం మరిన్ని వివరాలు స్లైడ్ షో లో చుడండి...

1/6 Pages

ప్రొడ్యూసర్ 


శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

English summary

Kalyana Vaibhogame Telugu movie directed by Nandini Reddy. Produced by Damodar Prasad. Starring Naga Shaurya, Malavika Nair. Music composed by Kalyan Koduri.