మహేష్‌కి బ్లాంక్‌ చెక్‌ ఆఫర్‌ చేసిన దర్శకుడు..

Director offers blank cheque to Mahesh Babu

05:31 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Director offers blank cheque to Mahesh Babu

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం బ్రహ్మూెత్సవం చిత్రం ఘాటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది అయిపోయిన వెంటనే మురుగదాస్‌ చిత్రంలో నటించబోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే క్లాసిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల మహేష్‌ని కలిసాడట. మహేష్‌తో శేఖర్‌ చేద్దామనుకున్న స్టోరీ లైన్‌ గురించి చెప్పాడట ఆ కాన్సెప్ట్‌ నచ్చడంతో దాన్ని డెవలెప్‌ చెయ్యమని మహేష్‌ శేఖర్‌కి చెప్పారట. ప్రస్తుతం ఆ కధని డెవలెప్‌ చెసే పనిలో శేఖర్‌ కమ్ముల బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా మహేష్‌తో 'టక్కరిదొంగ' చేసిన డైరెక్టర్‌ జయంత్‌ సి. పరాన్జీ మహేష్‌ని ఇటీవలే వెళ్లి కలిసారట.

అయితే ఈ సారి తను వెళ్లింది సినిమా డైరెక్ట్‌ చెయ్యడానికి కాదు శేఖర్‌కమ్ముల-మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకి తనే నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నారట. అందుకోసం మహేష్‌కి ఏకంగా బ్లాంక్‌ చెక్‌ ఇచ్చి మీకు ఇష్టమైనంత రాసుకోమన్నారట. కానీ కధ ఫైనల్‌ అయ్యాక కూర్చొని మాట్లాడదామని మహేష్‌ చెప్పారట. మీతో కచ్చితంగా సినిమా చేస్తానని కూడా మాటిచ్చారట మహేష్‌ అన్నీ కరెక్ట్‌గా కుదిరితే వీళ్ల ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా రావడం ఖాయం.

English summary

Director offers blank cheque to Mahesh Babu for Sekhar Kammula directing movie.