దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇచ్చిన కబాలి డైరెక్టర్

Director Pa Ranjith Talks About Kabali

10:30 AM ON 26th July, 2016 By Mirchi Vilas

Director Pa Ranjith Talks About Kabali

నచ్చితే నీ అంతటి వాడు లేదనడం, తేడా వస్తే, నువ్వు ఏం పీకావ్ అంటూ హేళన చేస్తారు. ఇది మానవ సహజం. సినీ ఇండస్టీలో ఇది మరీ ఎక్కువండి బాబూ. చాలామందికి ఈ అనుభవం ఎదురైనా, పాపం కబాలి దర్శకుడు పా రంజిత్ ఇప్పుడు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. సినిమా రిలీజ్ కి ముందు ఆకాశానికి ఎత్తేసినవారు, రిలీజ్ తరువాత వచ్చిన రిజల్ట్ తో రంజిత్ మీద విమర్శలు గుప్పించడం మొదలు పెట్టేసారు. రజినీ లాంటి హీరోను రంజిత్ నీరసంగా చూపించాడని అన్ని వైపులా విమర్శలు వ్యక్తమయ్యాయి. సినిమా కూడా సాగదీసినట్టు పేలవంగా సాగిందని అభిమానులు కూడా అనేస్తున్నారు. దీంతో పా రంజిత్ కి అసలు సీన్ అర్ధమైంది.

ఇక వరుసపెట్టి తనపై వస్తున్న విమర్శలకు పా రంజిత్ సమాధానం చెప్పేసాడు.'కబాలి విషయంలో నన్ను ఎంతమంది పొగిడారో, అంతేమంది తిట్టారు కూడా. ముందు నుంచీ కబాలి సినిమా వీలైనంత రియలిస్టిగ్గా తీయాలని అనుకున్నాం. రజనీకాంత్ రొటీన్ సినిమాల్లా అనవసర హంగు ఆర్భాటాలేవీ లేకుండా తీసాయాలనుకొన్నాం. రజనీ సార్ ఇమేజ్ను మాత్రమే క్యాష్ చేసుకునేలా కొన్నాళ్ళుగా సినిమాలు వచ్చాయి. కానీ నేను ఆయనలోని అద్భుతమైన నటుడిని చూపించాలని ప్రయత్నించా. సినిమాలు రియలిస్టిక్ గా తీయడమే నాకు తెలుసు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత ధైర్యంగా వివరణ ఇవ్వడం తో కొందరు షాకయ్యారు. ఎన్ని చెప్పినా హిట్ కొట్టేదాకా నిందలు పడక తప్పదు మరి అని కొందరు కామెంట్స్ పడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:అక్కడికి మేకప్ లేకుండా వెళ్లడంతో కాజల్ ని పట్టించుకోని జనాలు!

ఇవి కూడా చదవండి:కబాలి మూడు రోజుల కలక్షన్స్ ఎంతో తెలుసా.!

English summary

Pa Ranjith was the director was Super Star Rajinikanth's Latest film Kabali. Now this director was getting good name as well as bad name too. He said that some were saying that Kabali movie was not Rainikanth's movie and there was no rajinikanth's stylish elements in the movie. He said that he want to make Rajinikanth movie in a realistic way.