రాజమౌళి 1000 కోట్ల ప్రాజెక్ట్

Director Rjamouli announced Garuda project with 1000 crores budget

02:56 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Director Rjamouli announced Garuda project with 1000 crores budget

దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పాడు. బాహుబలికి కొనసాగింపుగా బాహుబలి-2 ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బాహుబలి-2 ఘాటింగ్‌ ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే మరో ప్రతిష్ఠాత్మకమైన చిత్రానికి తెర లేపాడు రాజమౌళి. ఇటీవల ఐఐటీ మద్రాస్‌లో జరిగిన టౌన్‌హాల్‌ సెషన్‌ మీటింగ్‌లో ఈ చిత్రం గురించి అనౌన్స్ చేశాడు. పురాణాలలో బౌద్ధమతం, హిందూ మతంలో ముఖ్యమైన పాత్ర గరుడ. ఆ గరుడ పక్షిని ముఖ్యపాత్రగా తీసుకుని బాహుబలి కంటే ఎక్కువ బడ్జెట్‌ 1000 కోట్లుతో ఈ చిత్రం తెరకెక్కించబడుతుంది.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నా మైండ్‌లో ఉన్నారు, అందులో ఒకరు ఎన్టీఆర్‌, మరొకరు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. రాజమౌళి, ఎన్టీఆర్‌ వీరిద్దరిది సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ అని తెలిసిందే. ఎన్టీఆర్‌తో రాజమౌళి తీసిన మూడు సినిమాలు సూపర్‌హిట్టే, గరుడ ఒక చారిత్రాత్మక చిత్రం కాబట్టి ఇందులో పెద్ద పెద్ద డైలాగులు ఉండడం సహజం, అటువంటి డైలాగులని ఎన్టీఆర్‌ అవలీలగా చెప్పగలడని ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నిరూపించుకున్నాడు కూడా అందువల్లే గరుడాకి ఎన్టీఆర్‌ని ఎంచుకున్నాడు అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఇదొక అంతర్జాతీయ చిత్రంగా తెరకెక్కించాలని రాజమౌళి ఉద్దేశం, అందుకే ఇంకో హీరోగా ప్రభాస్‌ని అనుకున్నా ప్రభాస్‌కి వేరే రాష్ట్రాల్లో అంత మార్కెట్ లేదు. 1000 కోట్లు బడ్జెట్‌ కావడంతో మహేష్‌బాబుని ఎంచుకున్నాడు.

English summary

Director Rjamouli announced Garuda project with 1000 crores budget. In this movie Jr. Ntr and Mahesh Babu playing lead roles.