రష్మీ చెంప పగలగొట్టిన డైరెక్టర్‌

Director slaps Rashmi

06:43 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Director slaps Rashmi

తొలుత పలు సినిమాల్లో హీరోయిన్‌ గా నటించి సరైన గుర్తింపు రాక సినీ పరిశ్రమకి దూరమై ఆ తరువాత ఈటీవీలో వచ్చిన 'జబర్ధస్త్‌' షోలో యాంకర్‌గా చేసి పాపులర్‌ అయింది. ఇందులో కురచ దుస్తులతో హాట్‌హాట్‌గా కనిపించి అభిమానుల్ని బానే సంపాదించుకుంది. దీనితో ఈ అమ్మడుకి మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. 'చందమామ కధలు' చిత్రంతో జాతీయ అవార్డు దక్కించుకున్న ప్రవీణ్‌ సత్తారు తాజాగా తెరకెక్కించే 'గుంటూర్‌ టాకీస్‌' చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఇంక అవకాశం రావడంతో ఇందులో రష్మీ రెచ్చిపోయి మరి నటించింది. తన అందాలు విపరీతంగా ఆరబోసింది.

అయితే ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు రష్మీ చెంప పగలగొట్టాడట. అసలు విషయంలోకి వస్తే ఇందులో వచ్చే కొన్ని భావోద్వేగిత సన్నివేశాలు బాగా రావడానికి డైరెక్టర్‌ రష్మీని చెయ్యి చేసుకున్నారట. దీనితో రష్మీ డైరెక్టర్‌ అనుకున్నట్లు నటించడానికి చాలా కష్టపడిందట. ఇటీవలే విడుదలైన గుంటూర్‌ టాకీస్‌ చిత్రం కొన్ని విమర్శలతో పాటు హిట్‌ టాక్‌ ని కూడా సంపాదించుకుంది.

English summary

Guntur Talkies director Praveen Sattaru slaps Rashmi Gautam in Guntur Talkies movie shooting.