సుకుమార్ అసిస్టెంట్ సూసైడ్

Director Sukumar assistant gets suicide

10:30 AM ON 24th August, 2016 By Mirchi Vilas

Director Sukumar assistant gets suicide

అవును నిజం, దర్శకుడు సుకుమార్.. అసిస్టెంట్ విక్రం సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ మూసాపేట్ లోని రెయిన్ బో విస్టా అపార్టుమెంట్ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన 32 ఏళ్ల విక్రం, తన తల్లి విజయలక్ష్మి, తమ్ముడు వివేక్ తో కలిసి రెయిన్ బో అపార్టుమెంట్ లోని ఓ ప్లాట్ లో వుంటున్నాడు. వన్- నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ వద్ద పనిచేశాడు. ఆదివారం ఇంటి నుంచి బయటకెళ్లిన విక్రమ్, సమీపంలోని ఓ బార్ లో ఫ్రెండ్స్ తో కలిసి మద్యం తీసుకున్నాడు.

రాత్రి 9 గంటలకు బార్ నుంచి బయటకొచ్చి ఫ్రెండ్స్ తో ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. అర్ధరాత్రి మూడుగంటల ప్రాంతంలో గస్తీ తిరిగే సెక్యూరిటీ సిబ్బందికి అపార్టుమెంట్ సెల్లార్ లో విక్రం మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నా విక్రం స్పందించలేదని ఆయన తల్లి తెలిపింది. విక్రమ్ ది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో టాలీవుడ్ షాక్ కు గురైంది. పలువురు సినీ ప్రముఖులు నిర్ఘాంతపోయారు.

English summary

Director Sukumar assistant gets suicide. Director Sukumar's assistant Vikram gets suicide in Hyderabad.