ఛ.. ఛ.. స్టేడియం బాత్ రూమ్ లో... షాక్ తిన్న క్రీడాకారిణులు

Dirty Messages Posted In Kanteerava Stadium Restroom

11:05 AM ON 19th December, 2016 By Mirchi Vilas

Dirty Messages Posted In Kanteerava Stadium Restroom

అక్కడా ఇక్కడా అని లేదు అన్నిచోట్లా ఛండాలంగా కొన్ని ఘటనలు చోటుచేసుకుంటూ షాకి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ప్లేయర్స్ బిక్కచచ్చిపోయే ఘటన ఒకటి కర్ణాటకలో జరిగింది. బెంగుళూరు కంఠీరవ స్టేడియంలో ఇతరులకు అనుమతి నిషేధమనే నిబంధన ఉంది. క్రీడాకారులకు గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. అయితే అక్కడ చోటుచేసుకున్న ఓ సంఘటన కలవరం రేపింది. స్టేడియం బాత్ రూమ్ లోకి వెళ్లిన క్రీడాకారిణులు షాక్ తిని క్షోభకు గురయ్యారు. ఆ వాష్ రూమ్ లోపల నాలుగువైపుల ఎవరో అసభ్యకర మెసేజ్ లు అంటించారు. రోజూ ప్రాక్టిస్ ముందు క్రీడాకారిణులు వాష్ రూమ్ లో ఇలా చేయాలని సూచిస్తూ అశ్లీల రాతలు రాశారు. ఆ మెసేజ్ అవి స్పోర్ట్స్ అథారిటీ పేరు మీద ఉండడంతో క్రీడాకారిణులు చలించిపోయారు. ముందుగా ఈ నిస్సిగ్గు రాతలను గమనించిన కొందరు జూనియర్ క్రీడాకారిణులు మిగతావారిని వాష్ రూమ్ లోకి వెళ్లవద్దంటూ వారించారు. ఆ తర్వాత ఈ దిగ్భ్రాంతికర విషయం తెలుసుకున్న సీనియర్ క్రీడాకారిణులు కోచ్ లు, అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఆగంతకులు వాష్ రూమ్ లోకి ప్రవేశించి, అంత సమయంలో లోపల ఉండి.. నాలుగుచోట్ల మెసేజ్ లు అంటించే ధైర్యం చేశారంటే తమకు రక్షణ ఎక్కడుందని పలువురు క్రీడాకారిణలు ప్రశ్నించారు. ఎక్కడైనా నిఘా కెమెరాలు పెట్టి ఉండరని ఎలా చెప్పగలమని వారు నిలదీశారు. ఇతరులను అనుమతించని ఈ స్టేడియంలో యువ సాధికారత, క్రీడల విభాగం క్రీడాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసింది. అయితే ఆ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కొందరు తల్లిద్రండులు తమ పిల్లలను స్టేడియం మాన్పించారు. ఈ దుశ్చర్య ఎవరో లోపలి వ్యక్తి పనేనని అనుమానిస్తున్న అధికారులు విచారణ చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలను, పోకిరిగాళ్లను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: మీరు పుట్టిన తేదీలో ఈ నెంబర్ ఉంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు!

ఇది కూడా చూడండి: తిరుమల గురించి అపోహలు... మనం తెలుసుకోవాల్సిన నిజాలు

ఇది కూడా చూడండి: శబరిమలలో ఉన్న స్వర్ణదేవాలయం గురించి ఎవరికీ తెలియని రహస్యాలు.

English summary

Men Dirty Messages Posted At Kanteerava Stadium Restroom on Friday.