ఆస్కార్ సభ్యుల ఎంపిక లో వివక్ష !

Discrimination in the selection of the members of the Oscar

06:53 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Discrimination in the selection of the members of the Oscar

ఆస్కార్‌ నామినేషన్స్‌లో కూడా వివక్షత ఉందా? వుందని అంటున్నారు కొందరు. వివరాల్లోకి వెళితే, ఇటీవల ప్రకటించిన 2016 ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్‌ పొందిన ‘రూమ్‌’లో ప్రముఖ నటుడు, అకాడమీ సభ్యుడు అయిన విలియమ్‌ హెచ్‌ మేసీ కీలక పాత్ర పోషించారు. ఆయన స్పందిస్తూ, ఆస్కార్‌ నామినేషన్స్‌లో భిన్నత్వం అవసరం అన్నారు. ఈ ఆస్కార్‌ నామినేషన్స్‌ ఎంపిక విధానంలో ఓటు వేసే సభ్యుల్లో ఎవరూ నల్లజాతీయులు లేరని అందుకే ఈ యేడాది నామినేషన్స్‌లో ఒక్క నల్ల జాతీయుడికి కూడా నామినేషన్‌ దక్కలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయనే కాదు ఈ యేడాది నామినేషన్స్‌లో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఓ ఇంటర్వూలో మేసీ మాట్లాడుతూ.. కొందరు సభ్యులు కనీసం బరిలో ఉన్న చిత్రాలను వీక్షించకుండా తమకు సన్నిహితులైన వారికి ఓటు వేస్తున్నారని విచారం వ్యక్తంచేసారు.ఈ పద్దతిలో మార్పు రావాలన్నారు. స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ చిత్రంతో ఆస్కార్‌ అవార్డును సొంతం చేసున్న ప్రముఖ దర్శకుడు డానీ బోయిల్‌ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, నామినేషన్స్‌ ఎంపికలో కేవలం ప్రతిభను మాత్రమే గుర్తించాలని, శరీర రంగును బట్టి ఓటువేయడం దురదృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఈ ఏడాది ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవాన్ని బహిష్కరించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆస్కార్ ని వివక్షత వెంటాడు తోంది.

English summary

Discrimination in the selection of the members of the Oscar.This was said bye some of the hollywood actors .