ఆ పని కోసం ఒలింపిక్స్ మెడల్ నే వేలానికి పెట్టాడు!

Discus Thrower Priyother puts olympic medal for auction

01:05 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Discus Thrower Priyother puts olympic medal for auction

ఒలింపిక్స్ లో పతకం గెలవడమంటే మాటలు కాదు! పోలండ్ కు చెందిన డిస్కస్ త్రోయర్ పియోటర్ మలచౌస్కీ రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించాడు. ఓ గొప్ప పని కోసం దానిని వేలానికి పెట్టాడు. ఇంతకీ ఆ పనేంటో తెలుసా? మూడేళ్ళ బాలుడికి కంటి కేన్సర్ ఉందని తెలిసిన వెంటనే మరో ఆలోచన లేకుండా తన రజత పతకాన్ని వేలానికి పెడుతున్నట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. బాలుడు ఒలెక్ తల్లి రాసిన లేఖ తన గుండెను పిండేసిందని పియోటర్ ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పాడు. రెండేళ్ళ నుంచి ఒలెక్ కంటి కేన్సర్ తో బాధపడుతున్నాడని, న్యూయార్క్ లో చికిత్స చేయించడం తప్ప మరో మార్గం లేదని ఆమె రాశారని తెలిపాడు.

రియోలో నేను బంగారు పతకం కోసం పోరాడాను. అంతకన్నా ఎక్కువ విలువైనదాని కోసం పోరాడాలని ఈరోజు నేను పిలుపునిస్తున్నాను అని పియోటర్ రాశాడు. మీరు నాకు సహాయం చేస్తే, నా రజత పతకం ఒలెక్ విషయంలో బంగారు పతకం కన్నా ఎక్కువ విలువైనదిగా మారవచ్చు అని విజ్ఞప్తి చేశాడు. దీనికి వచ్చే మొత్తం డబ్బును ఒలెక్ చికిత్స కోసమే ఉపయోగిస్తానని కూడా స్పష్టం చేశాడు. అనంతరం పియోటర్ పెట్టిన మరో పోస్ట్ లో తన పతకాన్ని కొనేవాళ్ళు దొరికారని చెప్పాడు.

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు తెలియకుండా పైలట్స్ రహస్యంగా ఉంచే సీక్రెట్స్ ఇవే!

ఇది కూడా చదవండి: హన్సికకి సడన్ గా టాలీవుడ్ లో అన్ని ఆఫర్స్ రావడానికి కారణం తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: కుక్కని రేప్ చేసిన కామాంధుడు.. ఆ పై బట్టలూడదీసి..(వీడియో)

English summary

Discus Thrower Priyother puts olympic medal for auction.