భలే చాన్సులే ... లక్కీ చాన్స్ లే 

Dish Patani To Act With JackieChan

06:58 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Dish Patani To Act With JackieChan

అదృష్టం వెతుక్కుంటూ వస్తే, అలానే వుంటుంది. అందుకే తెలుగులో ‘లోఫర్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఏకంగా జాకీ చాన్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. ఇంకెవరు నటి దిశా పటానీ. ప్రస్తుతం హిందీలో నీరజ్‌ పాండే దర్శకత్వం వహిస్తున్న ‘ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’లో ఓ పాత్రలో నటిస్తున్న ఈమె తాజాగా జాకీచాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కుంగ్‌ఫూ యోగా’లో యాక్షన్‌ హీరోయిన్‌గానే కాకుండా జాకీకి ప్రేయసిగానూ నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల టాక్. జిమ్నాస్టిక్స్‌లో అనుభవం ఉండడం ఈ పాత్రకు ఆమె ఎంపికవడానికి ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. యోగా, మార్షల్‌ ఆర్ట్స్‌ తెలిసిన ఆర్కియాలజీ ప్రొఫెసరుగా ఆమె ఈ చిత్రంలో నటించబోతున్నట్టు భోగట్టా. వాటి సహాయంతోనే హీరో ఓ నిధిని కనుగొంటాడట. మొత్తానికి లాక్కే హీరోయినే.

English summary

Disha Patani who were acted as heoine in Varun Tej's Loafer Movie was got a chance to act with hollywood super star jackie chan in his next film "Kung Fu Yoga" Movie.Disha Patani was also acting in a lead role in Dhoni-The Untold Story Movie