జాకీచాన్ సరసన దిశాపటాని

Disha Patani to act With Jackie Chan

10:07 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Disha Patani to act  With Jackie Chan

‘లోఫర్‌’లో పారిజాతం అలియాస్‌ మౌనీగా అలరించిన బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ స్థాయికి చేరిపోయింది. ఓ ప్రపంచ స్థాయి సినిమాలో నటించబోతోంది. చైనీస్‌ స్టార్‌ జాకీచాన్‌ చిత్రంలో .... జాకీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కుంగ్‌ ఫు యోగా’లో హీరోయిన్ గా దిశ ఎంపికైంది. టిబెట్‌లోని మగధ సామ్రాజ్య నిధి అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. చైనా - భారతదేశం నేపథ్యంతో రూపొందే ఈ చిత్రంలో దిశా పటాని ఓ పురాతత్వ శాస్త్ర అధ్యాపకురాలిగా కనిపిస్తుంది. ఇందులో హీరో స్థాయిలో ఫైట్లు, యాక్షన్‌ సన్నివేశాలతో ఆమె పాత్ర ఉంటుందట. అందుకే యోగా, యుద్ధ కళల్లో ప్రవేశం ఉన్న ఆమెను ఎంపిక చేసుకున్నారని భోగట్టా.ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ త్వరలో ఐస్‌లాండ్‌లో జరుగుతుంది. ఆ తర్వాత మన దేశంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట.

English summary

Disha Patani who was acted in Loafer Movie along with Varun Tej has grabbed a chance to act with Jackie Chan In "Kung Fu Yoga MoVie"