పవన్‌ ఒప్పుకుంటే దానికి కూడా రెడీ అట

Disha Patani Wants To Act In Pawan Kalyan Movie

01:08 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Disha Patani Wants To Act In Pawan Kalyan Movie

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. ఈ పేరుకి రాష్ట్రవ్యాప్తంగా ఎంత పవర్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి పవన్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తే చాలు అని ఎంతో మంది హీరోయిన్లు చెప్తూ ఉంటారు. ఒకవేళ హీరోయిన్‌గా కాకపోయిన పవన్‌ పక్కన చిన్న పాత్రలో నటించినా చాలని ఎంతో మంది హీరోయిన్లు కలలు కంటారు. తాజాగా మరో భామ కూడా పవన్‌పై ఇటువంటి స్టేట్‌మెంట్లే ఇచ్చింది. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వం వహించిన 'లోఫర్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దిశా పటాని వపన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్‌ సినిమాలో హీరోయిన్‌గా ఒక్కఛాన్స్‌ ఇస్తే నేనేంటో నిరూపించుకుంటా అని ఈ అమ్మడు చెప్పింది.

ఒకవేళ హీరోయిన్‌గా కూడా కుదరకపోతే పవన్‌ సినిమాలో ఒక్క ఐటమ్‌ సాంగ్‌ చేసినా చాలు జీవితం ధన్యం అంటుంది. ఈ అమ్మడుకి టాలీవుడ్‌ లోబాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. చాలదన్నట్టు చైనా స్టార్ జాకీ చాన్‌ చిత్రంలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. అయితే ఇవేమి అమ్మడుకి సంతృప్తిని ఇవ్వలేదు. పవనే కావాలంటుంది. పవన్‌తో సినిమా చేస్తే చాలు ఇది నా డ్రీమ్‌ అంటుంది. అయితే పవన్‌ ప్రస్తుతం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఐటమ్‌ సాంగ్‌ కూడా అదిరిపోయింది కాబట్టి ఈ సినియాలో దిశా పటానికి అవకాశం వచ్చే అవకాశం లేదు. కాబట్టి పవన్‌ తన తదుపరి చిత్రంలోనైనా దిశా పటానిని గుర్తించి అవకాశం ఇస్తాడేమో చూడాలి.

దిశా పటాని గురించి మీకు తెలియని విషయాలు.....

1/6 Pages

దిశా పటాని బర్త్ డే


దిశా పటాని 13 జూన్ , 1992 వ సంవత్సరం లో ఉత్తరప్రదేశ్ లో పుట్టింది .

English summary

Disha Patani Who was acted as Heroine in Varun Tej's LOafer movie under the direction of Puri Jagannadh.She says that she wants to act with Power Star Pawan Kalyan and she also says that if not possible to act as heroine she wants to act in Item Song in Pawan Kalyan Movie.Presently she was wacting in Kung Fu Yoga Movie along with China Super Star Jackie Chan.