'డిషూం' పోస్టర్ వదిలేసారు

Dishoom First Look Poster Released

02:41 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Dishoom First Look Poster Released

బాలీవుడ్ నటులు జాన్ అబ్రహం, వరుణ్ ధావన్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'డిషూం' చిత్రపోస్టర్ విడుదలైంది. జాన్, వరుణ్లు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ చిత్ర పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో వరుణ్, జాన్లు బుల్డాగ్ని పట్టుకుని నడుస్తూ కన్పిస్తున్నారు.

వీరిద్దరూ ఇందులో కబీర్, జునైద్లుగా నటిస్తున్నారు. వీరిద్దరికీ జంటగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. ఈ మధ్యనే సినిమాలో జాక్వెలిన్ లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి వరుణ్ సోదరుడు రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. జులై 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సాజిద్ నదియాద్వాలా, ఈరోస్ నౌ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

English summary

Bollywood Heroes John Abraham and Varun Dhawan were acted together in a film called Dishoom and this movie first look was released by the movie unit.