ఇండియా-పాక్ మ్యాచ్ సమయంలో కోహ్లి కిడ్నాప్ అయితే(వీడియో)

Dishoom movie trailer

03:42 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Dishoom movie trailer

ఏంటీ ఇండియా స్టార్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లీని కిడ్నాప్ చేసారా? పాకిస్తాన్ ఆటగాళ్ళు కోహ్లిని కిడ్నాప్ చేసారా? అసలెందుకు కిడ్నాప్ చేసారు? కిడ్నాప్ చెయ్యవలసిన అవసరం ఏముంది? అసలు వాళ్ళ డిమాండ్స్ ఏమిటి? ఇలా మీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి కదా? అయితే కంగారు పడకండి, ఇదంతా నిజ జీవితంలో కాదు సినిమా జీవితంలో.. అవును అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే.. త్వరలో బాలీవుడ్ నుంచి డిష్యూం అనే చిత్రం రాబోతుంది. దీనికి రోహిత్ ధావన్ దర్శకుడు.

ఈ సినిమాలో ఢిల్లీ బాట్స్ మెన్ విరాట్ కోహ్లీ కిడ్నాప్ అయితే అనే అంశం పై తెరకెక్కుతుంది. పాకిస్తాన్-భారత్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ కిడ్నాప్ అయ్యే కథాంశంతో చిత్రాన్ని తీస్తున్నారు. చిరకాల ప్రత్యర్థులు ఇండియా-పాకిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది, స్టేడియమంతా ప్రేక్షకులతో నిండిపోయింది. అభిమానులు కేకలు, అరుపులతో దద్దరిల్లుతోంది. ఆ సమయంలో ఇండియా టీంలో ఆడుతున్న కీలక ఆటగాడు కిడ్నాప్ అయితే... ఈ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇందులో కోహ్లీ పాత్రలో సఖీబ్ సలీమ్ నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో అతని పాత్ర పేరు విరాజ్. మ్యాచ్కి కొన్ని నిమిషాల ముందు కిడ్నాపైన పాత్రలో సలీమ్, ఇతర ముఖ్యపాత్రల్లో జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రాహుల్ ఖన్నాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఒకసారి ఆ వీడియో పై ఒక లుక్ వేసేయండి.

English summary

Dishoom movie trailer