భాగ్యనగరిలో రూ 25వేల కోట్లతో డిస్నీ లాండ్ 

Disneyland is coming to Hyderabad

04:06 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Disneyland is coming to Hyderabad

దాదాపు నాలుగు వందల ఏళ్ళ కు పైగా చరిత్ర గల హైదరాబాద్ లో ఓ అద్భుత నిర్మాణం రాబోతోంది. అదే డిస్నీలాండ్ . ఏకంగా 25వేల కోట్ల రూపాయలతో డిస్నీలాండ్ ఏర్పాటు కానుంది. అంతర్జాతీయంగా పేరొందిన ప్రతిష్టాత్మక డిస్నీలాండ్ హాంగ్ కాంగ్, లాస్ ఏంజల్స్, షాంఘై వంటి నగరాల్లో మరింత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు భాగ్య నగరంలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులు వస్తున్నారట. డిస్నీలాండ్ కోసం ఏకంగా 300 ఎకరాలైన అవసరమవుతుంది. పురాతన కోటల నమూనాలు, పిల్లలకు సంబంధించిన వింతలూ, వినోదాలు... ఇలా అందరినీ అలరించే విధంగా డిస్నీ లాండ్ రూపు దిద్దుకోనుంది.

హైదరాబాద్ ను విశ్వ నగరంగా రూపు దిద్దుకాలని సర్కార్ భావిస్తున్న తరుణంలో డిస్నీలాండ్ వస్తే, ఆ దిశగా అడుగు పడినట్లే. ఇక పర్యాటకంగా కూడా మరింత ప్రాచుర్యం పొందనుంది.

డిస్నీలాండ్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు


ప్రపంచంలో డిస్నీలాండ్ మొత్తం 6 దేశాల్లో ఉంది. మొదట దీనిని ఆనేహైమ్(Anaheim) నగరం, కాలిఫోర్నియా(California) లో వాల్ట్ డిస్నీ సంస్థ 1955, జులై 17న స్ధాపించారు.

English summary

Disneyland is coming to Hyderabad. The Disneyland is first builted in Anaheim city California by Walt Disney.