గుడివాడలో ఉద్రిక్తత

Dispute between TDP and YCP in Gudivada

01:39 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Dispute between TDP and YCP in Gudivada

గుడివాడ వైసీపీ కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసిపి కార్యాలయం ముందు కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. కొడాలి నాని పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ పొంది విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నాడని వెంకన్న ధ్వజ మెత్తారు. కొడాలి నాని పిచ్చోడని, ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కావడం లేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడాలి నాని చేసిన సవాల్‌కు స్పందించి ఇక్కడకు వచ్చామని, ఏం చేస్తారో చూస్తామని పేర్కొన్నారు. కొడాలి నాని పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తున్నాడని, ప్రజలు అతనిని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగా బుద్దా వెంకన్నతో పాటు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే , శరత థియేటర్‌లో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విలేకరులతో మాట్లాడుతూ గుడివాడలో తనను ఎదుర్కొనే సత్తాలేక వైసీపీ కార్యాలయ యజమానులను అడ్డుపెట్టుకొని పోలీసులతో అరెస్టు చేయించారనీ ఆరోపించారు. తాటాకు చప్పుళ్లుకు భయపడనని వైసీపీ కార్యాలయంలోనే ఉంటాననీ అన్నారు. రెండు నెలల క్రితం భవన యజమాని సుశీల కార్యాలయాన్ని ఖాళీ చేయమని కోరగా సమయం అడిగానని, ఈ క్రమంలోనే చంద్రబాబు బంధువులను కలిసి తనపై పోలీసులను ప్రయోగించి కార్యాలయాన్ని ఖాళీ చేయించే కుట్ర పన్నారనీ నాని ఆరోపించారు. తనను ఓడిస్తే గుడివాడ వదిలి వెళ్ళిపోతానని చెప్పారు. చంద్రబాబు నాయుడు పారదర్శకంగా పాలనచేస్తానని హామీ ఇచ్చి తనను టార్గెట్‌ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని దమ్ముంటే టీడీపీ నేతలు తనను ఓడించాలని సవాల్‌ విసిరారు.

English summary

Dispute between TDP and YCP in Gudivada.In gudivada TDP activist and YCP activist are disputed .