ఉన్నతాధికారులతో బాబు బంధం బెడిసికొట్టిందా?

Disputes Between Chandrababu And SP Takkar

12:20 PM ON 7th May, 2016 By Mirchi Vilas

Disputes Between Chandrababu And SP Takkar

అధికారులతో అందునా ఐఎఎస్, ఐపీఎస్ లతో మంచి సంబంధాలు కలిగి వుండే ఎపి సిఎమ్ చంద్రబాబు వైఖరి ఇప్పుడు మారిపోయిందా ? వారితో బాబు బంధం తెగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు కూడా కాకముందే ఎస్ పి టక్కర్ సెలవుపై వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. దీనికి ఏదో సాకు చూపుతున్నప్పటికీ ప్రధాన అంశం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పొసగడం లేదని సచివాలయ వర్గాల్లో పెద్ద టాక్. ముఖ్యమంత్రి తీరుతో సీఎస్ సర్దుకుపోలేకపోతున్నారని ఆయన బ్యాచ్ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఐఎఎస్ లు - ఐపిఎస్ ల బదిలీల వ్యవహారంపై ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారులను బదిలీ చేయాలని సీఎస్ సిఫార్సు చేయగా చంద్రబాబు వేచి చూసే ధోరణి అవలంబించడం చాలాసార్లు అందుకు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో టక్కర్ అసంతృప్తికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: పబ్లిక్ లో ఫ్యాన్ తో అక్కడ చెయ్యి వేయించుకున్న సన్నీ!

చాలామంది సీనియర్ అధికారులు జూనియర్లుగా ఉన్నప్పటి నుండి తాను వారి పని తీరును గమనిస్తున్నానని కనుక బాగా పనిచేసే వారికి మంచి పోస్టింగ్ లు ఇవ్వాలనే సిఎస్ అభిప్రాయంతో కూడా చంద్రబాబు విభేదించారట. పరిపాలన సజావుగా సాగుతున్న చోట పరిస్థితులను డిస్టర్బ్ చేయవద్దని సిఎస్ కి ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా సిఎస్ నిర్ణయానికి అడ్డుకట్ట వేసినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను సిఎస్ గా నియమించాలని చంద్రబాబు భావించినట్లు, అప్పట్లో టక్కర్ ఎంపికకు చంద్రబాబు అంత సానుకూలత కనబరచలేనట్లు కూడా చెప్పుకుంటున్నారు. అయితే సీనియర్ అధికారి కావడంతోనూ కాదనలేక టక్కర్ కు పదోన్నతి కలిపించినా, ఏదో నామక అన్నట్లు అనేక విషయాల్లో సీఎస్ ను విశ్వాసంలోకి తీసుకోవడం లేదట.

ఇవి కూడా చదవండి:బిల్లు కడితే డేటింగ్ కి రెడీ అంటున్న గేల్

సుదీర్ఘ సమీక్షలు - రాత్రి పొద్దుపోయే వరకూ కలెక్టర్ల సమావేశాలు - వీడియోకాన్ఫరెన్స్ లు నిర్వహించడమేగాక అనుదినం వారితో మాట్లాడే ప్రయత్నంలో కలెక్టర్ల సమయం రోజుకు మూడు నాలుగు గంటల పాటు వృథా అవుతోందనే చర్చ బహిరంగంగా జరుగుతోంది. సీఎస్ కు తెలియకుండానే చాలా కార్యక్రమాలను సిఎం కార్యాలయ అధికారులు చకచకా కానిచ్చేస్తున్నారని అది కూడా సీఎంకు - సీఎస్ కు మధ్య సంబంధాలను దెబ్బతీసిందని అంటున్నారు. ఐఎఎస్ అధికారుల బదిలీల్లో - పోస్టింగ్ లలో టక్కర్ కొంత స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే అలాంటి ఆలోచనలు లేకుండానే సీఎం కార్యాలయం జాబితాలను పంపిస్తోందని దాంతోనే టక్కర్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. భారీగా ఐపిఎస్ లను బదిలీ చేసిన చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లో ఐఎఎస్ ల బదిలీలకు సైతం కసరత్తు ప్రారంభించారని ఇదే ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడానికి కారణమైందని అంటున్నారు. మొత్తానికి పరిపాలన గాడి తప్పుతోందా? కావాలనే సిఎమ్ ని టార్గెట్ చేస్తున్నారా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఉజ్జయిని కుంభమేళా - పోటెత్తిన భక్తజనం

మరోసారి కనిపించబోతున్న శక్తి మాన్

టిఆర్ఎస్ లో వైసిపి విలీనం

English summary

A Recent News came to know that there was disputed between Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and SP Takkar.