బిజెపి - టిడిపి మధ్య చెడడానికి ఇలాంటి మాటలు చాలేమో ?

Disputes Between TDP and BJP

07:12 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Disputes Between TDP and BJP

బిజెపి - టిడిపి బంధం చెడగొట్టడానికి ప్రతిపక్షాలు కుట్రలు , కుతంత్రాలు చేస్తాయన్న ఆరోపణల మాటేమో గానీ , కొందరు పనిగట్టుకుని చేసే వ్యాఖలు మాత్రం మిత్ర బంధాన్ని దేబ్బతీస్తాయన్న మాట బలంగా వినిపిస్తోంది. టిడిపి లో చేరిన కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఏదో మాట్లాడారని అనుకుంటే పొరపాటే. కరుడు గట్టిన టిడిపి వారే అదోరకంగా మాట్లడుతున్నరండి. గొప్పకోసం మాట్లాడే మాటలు ఒక్కోసారి వికటిస్తాయి. సీఎం చంద్రబాబు - ప్రధాని మోడీ మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయి.

ఆమధ్య అనంతపుం ఎంపి జేసి దివాకర్ రెడ్డి కేంద్రాన్ని ఉద్దేశించి, కేంద్రం దగ్గర చేతులు కట్టుకుని ఉండాలే తప్ప , ఏమి మాట్లాడడానికి వీల్లేదు మాట్లాడినా పట్టించుకునే వారు లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇబ్బంది తెచ్చిపెట్టాయని టిడిపి లో చర్చ జరిగింది. మొన్నటికి మొన్న టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు బీహార్ ఎన్నికల తర్వాత బిజెపిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఇప్పుడు టిడిపి ఎం ఎల్ సి యలమంచి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు కూడా ఆలానే వున్నాయి. మోడీ - బాబు ల మధ్య చిచ్చుపెట్టే విధంగా వున్నాయి.

మోడీ స్థానంలో చంద్రబాబు ప్రధాని అవుతారనే అర్థంలో తెలుగుదేశం నేతలి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యపై బీజేపీ నేతలను కవ్విస్తున్నాయి. అందుకే ఆ మాటను బీజేపీ అధిష్ఠానానికి వీలైతే మోడీ వరకు మోసుకెళ్లాలని బీజేపీలో కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్టు బోగట్టా. ఈ మధ్యే రెండు పార్టీల పెద్దలు కూర్చుని ఇకముందు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. బంధం చేదేవిధంగా ఎవరుఓ వ్యవహరిచారాదని అనుకున్నారు.

ఇంతలోనే చంద్రబాబునాయుడు ప్రధాని అవుతారన్న రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం విశేషం. ఈ మాటల రికార్డును కొందరు బిజెపి నేతలు ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధినేత అమిత్ షా - హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ లకు పంపించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లోకేష్ సీఎం అవుతారన్న విషయం ఆ పార్టీకి సంబంధించినదని అయితే బాబు ప్రధాని అవుతారంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓడిపోవాలన్న టీడీపీ కోరిక తెలుస్తోందని వారు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు వినికిడి.

పైగా రాజేంద్రప్రసాద్ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నందున ఆయన మాటలను పార్టీ మాటలుగానే భావించాల్సి వస్తుందని , . టిడిపి నాయకత్వం అనుమతితోనే ఆయన అలా అన్నారనే అనుకోవాల్సి ఉంటుందని బిజెపి నేతలు అంటున్నారంట. అంతేకాదు చంద్రబాబు కానీ టీడీపీ ముఖ్యులు కానీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను ఖండించలేదనీ బిజెపి నేతలు ప్రస్తావిస్తున్నారు. అయితే , రాజేంద్రుని వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేకపోయినా చంద్రబాబుకు మాత్రం తలనొప్పి తప్పడం లేదు. రెండు పార్టీల మధ్య సమన్వయ భేటీ జరిగి వారం కాకుండానే టీడీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అంటోంది. మరి ఇకముందు టిడిపి నేతలు ఇలాంటి మాటలు మాట్లాడకుండా బాబు గారు గట్టిగా క్లాస్ తీసుకుంటారేమో....

English summary

There were many incidents in recent times that there were disputes between Telugu Desam Party(TDP) And Bharateeya Janata Party (BJP). Recently TDP leader MLC rajendra prasad says that chandra babu to become next prime minister