పూరి పై డిస్ట్రిబ్యూటర్ల ఫైర్

Distributors Fire On Puri Jagannadh

04:29 PM ON 18th April, 2016 By Mirchi Vilas

Distributors Fire On Puri Jagannadh

సినీ పరిశ్రమలో భాగమైన డిస్ట్రిబ్యూటర్లపై సినీ దర్శకుడు పూరీ జగన్నాధ్‌ తప్పుడు కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదని ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల అసోషియేషన్‌ ఫైర్ అయింది. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ నటించిన లోఫర్‌ చిత్రానికి పూరీ జగన్నాధ్‌ దర్శకత్వం వహించగా , ఆ సినిమా ప్లాప్‌ కావడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ కోరారు. దేని పై పూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ , నిర్మాతను అడగాలని అని చెప్పినా వినకుండా నాపై దాడి చేసారంటూ డిస్ట్రిబ్యూటర్ల పై కేసు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడేలా వుంది. డిస్ట్రిబ్యూటర్ల అసోషియేషన్‌ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు అనుశ్రీ సత్యనారాయణ, అసోషియేషన్‌ జిల్లా కార్యదర్శి వానపల్లి గౌరీశంకర్‌, ఉపాధ్యక్షుడు మూర్తి, వడ్డి మురళి, గీతా ఫిల్మ్స్ శాస్త్రి తదితరులు సోమవారం రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో ద్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి: పూరీ పై 'లోఫర్' దాడి

డిస్ట్రిబ్యూటర్లపై పూరీ జగన్నాధ్‌ తప్పుడు కేసులు బనాయించడం తగదన్నారు. సినీ నిర్మాత కల్యాణ్‌ తన వంతుగా నష్టాన్ని భర్తీ చేయడానికి అంగీకరించారని, అయితే పూరీ జగన్నాధ్‌ భర్తీ చేయవలసిన నష్టంపై ఎదురు తిరిగి అక్రమ కేసులు పెట్టారని వారు అంటున్నారు. సినిమా విజయవంతమైతే లాభాల్లో 20 శాతం మాత్రమే తమకు ఇస్తారని, సినిమా ఫ్లాప్‌ అయితే కనీసం 20 శాతం సొమ్ము వెనక్కి ఇవ్వాలని వేడుకుంటున్నామని వారు మొరపెట్టుకుంటున్నారు. రజనీకాంత్‌, సూర్య, మహేష్‌బాబు వంటి హీరోలు తమ సినిమాలు ఫ్లాప్‌ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేసిన విషయాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అఖిల్‌ విడుదలైన రెండవరోజు ఆ చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు చేసి, మరీ అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారని వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్లయిన రామదాసు, సుధీర్‌, అభిషేక్‌లపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని, మోసం చేసిన పూరీ జగన్నాధ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి:

బన్నీ మూవీకి బంపర్ ఆఫర్

చిరు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

పొద్దున్న టీచర్ నైట్ పోర్న్ స్టార్

English summary

Recently Director Puri Jagannadh was filed a case on distributors by saying that distributors of Loafer movie was attacked him in his home. East Godavari Producers President Anu Sri Satyanarayana said that Puri Jagannadh was filed case on dritributers by saying false reasons.