ముదురుతున్న పూరీ వ్యవహారం - దావాకు రెడీ

Distributors To File Defamation Case On PUri Jagannadh

04:39 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Distributors To File Defamation Case On PUri Jagannadh

పూరి జగన్నాథ్, లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చిందన్న చందంగా వ్యవహారం తయ్యారయింది. పూరి పై పరువునష్టం దావా వేయాలని డిస్ట్రిబ్యూటర్లు సుధీర్, అభిషేక్, ముత్యాల రాందాస్ నిర్ణయించారు. తనపై దాడి చేశారని వీరిపై పూరి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో వారు స్పందిస్తూ, తామేమీ దాడి చేయలేదని ఖండించారు. పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ గనుకే తాము ‘లోఫర్’ సినిమా హక్కులు కొన్నామని వారు పేర్కొంటూ, తమ నష్టాలను భర్తీ చేయాలని నిర్మాత సి.కళ్యాణ్‌ను కోరుతామని తెల్పారు.

ఇవి కూడా చదవండి: అమ్మాయిల రిక్వెస్ట్ లు యాక్సెప్ట్ చేస్తే ఇంక అంతే!

మరోపక్క పూరి చర్యను తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తీవ్రంగా తప్పు పట్టింది. ఇది తప్పుడు కేసని, ప్రొడ్యూసర్ నుంచి గానీ, డైరెక్టర్ నుంచి గానీ ఈ డిస్ట్రిబ్యూటర్లు ఏమీ డిమాండ్ చేయలేదని ఈ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర రెడ్డి చెప్పారు. నష్టాలు ఎక్కువగా వచ్చినందున కొంతవరకు వాటిని భర్తీ చేయాల్సిందిగా మాత్రమే వీళ్ళు కోరుతున్నారని ఆయన అన్నారు. అసలు వీరిపై పూరియే ఫిర్యాదు చేశారా లేక అలా చేయాలని ఆయనకు ఎవరైనా సలహా ఇచ్చారా అని సుధాకర రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి నాలుగు గోడల మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడింది.

ఇవి కూడా చదవండి:

విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

ప్రత్యూష కు అబార్షన్ అయిందా ..?

పెద్దవారి పాదాలకు ఎందుకు నమస్కారం చెయ్యాలి

English summary

Recently Director Puri Jagannadh filed a case against loafer movie distributors by saying that they have been attacked him in his house and later this was opposed by Distributors and now Telugu distributors association leaders have decided to file defamation case on Puri Jagannadh.