ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లో జోకర్

Djokovic Enters Into Australian Open Finals

10:35 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Djokovic Enters Into Australian Open Finals

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి స్విస్‌ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ నిష్క్రమించాడు. సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌, సెర్బియా ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ చేతిలో ఫెదరర్‌ పరాజయం పాలయ్యాడు. గురువారం జరిగిన సెమీఫైనల్‌లో జకోవిచ్‌ 6-1, 6-2, 3-6, 6-3తో ఫెదరర్‌పై గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జకోవిచ్‌తో మ్యాచ్‌ అంటేనే తడబాటుకు గురయ్యే అలవాటును ఫెదరర్‌ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. ఇప్పటికే ఐదుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్‌ ను సొంతం చేసుకున్న డిపెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ మరోసారి టైటిల్‌కు చేరువయ్యాడు.

English summary

Serbian star tennis player Djokovic has defeated Swiss Player Roger Federer in the semi final match in Australian Open. Djokovic Enters into the finals by defeating Federer in Final Match