టోర్నీ మధ్యలోనే తప్పుకున్న జోకర్

Djokovic Quits From Dubai Open

01:00 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Djokovic Quits From Dubai Open

టెన్నిస్ లో వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ నొవాక్ జోకోవిచ్ దుబాయ్ ఓపెన్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు ఫెలిసియనో లోపేజ్ తో తలపడగా అనారోగ్యం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. లోపేజ్ తో మ్యాచ్ లో తొలి సెట్ కోల్పోయిన తర్వాత తనకు కంటి సమస్య తలెత్తిందని భావించిన జోకో మ్యాచ్ కొనసాగించలేనని చెప్పడంతో అంపైర్ మ్యాచ్ ను నిలిపివేశాడు. చివరిసారిగా 2011లో అర్జైంటైనా ఆటగాడు డెల్ పొట్రోతో తలపడ్డ మ్యాచ్ మధ్యలోనే జోకోవిచ్ ఆట నుంచి తప్పకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ 4, స్విస్ వీరుడు స్టానిస్లాస్ వావ్రింకా 7-5, 6-1తేడాతో జర్మనీ ప్లేయర్ కొల్ స్క్రేబర్ పై విజయాన్ని సాధించాడు. ఈ మ్యాచ్ లో వావ్రింకా ఏడు ఎస్ లు సంధించగా జర్మనీ ఆటగాడి నుంచి సమాధానమే లేకపోయింది.

English summary

Novak Djokovic’s streak of ATP World Tour finals reached will end at 17 after the World No. 1 retired against Feliciano Lopez in the quarter-finals of the Dubai Duty Free Tennis Championships due to Eye problem.